Devara: ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై అద్భుతమైన ఓపెనింగ్ వసూళ్లను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో కి మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు రావడం కొత్తేమి కాదు, కానీ వీకెండ్ వరకు ఈ చిత్రం అనేక ప్రాంతాలలో #RRR తో సమానంగా వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్స్ కి టాక్ ఎలా ఉన్నప్పటికీ కూడా మొదటి వీకెండ్ అద్భుతమైన వసూళ్లు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ మొదటి సోమవారం సినిమా రేంజ్ ని నిర్ణయిస్తుంది. లాంగ్ రన్ లో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతుందా లేదా అని తెలిసేది సోమవారం రోజే. నేడు మార్నింగ్ షోస్ నుండి ఈ సినిమా ట్రెండ్ ప్రాంతాల వారీగా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
అందరూ ఊహించినట్టుగానే సీడెడ్ లో నేడు కూడా ‘దేవర’ చిత్రం దంచికొట్టేసింది. మార్నింగ్ షోస్ ఈ రేంజ్ లో ఉన్నాయంటే, కచ్చితంగా సాయంత్రం నుండి కళ్ళు చెదిరే ఆక్యుపెన్సీలు ఉంటాయని, నేడు ఈ చిత్రానికి కోటి రూపాయలకు పైగా షేర్ కేవలం ఈ ఒక్క ప్రాంతం నుండి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం విషయానికి వస్తే వైజాగ్,అనకాపల్లి వంటి ప్రాంతాల్లో చాలా డీసెంట్ వసూళ్లు నమోదు చేసుకున్నప్పటికీ, ఉత్తరాంధ్ర లోని మిగిలిన ప్రాంతాల్లో వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఇక పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల పరిస్థితి గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అని చెప్పొచ్చు. రేపటి నుండి ఈ ప్రాంతాలలో డే డెఫిసిట్ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. కృష్ణ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి, విజయవాడ లో కేవలం ఒక్కే ఒక్క థియేటర్ లో తప్ప మిగిలిన థియేటర్స్ లో కనీస స్థాయి ఆక్యుపెన్సీలు కూడా నమోదు చేసుకోలేదు. ఎన్టీఆర్ కి బాగా స్ట్రాంగ్ జోన్ గా పిలవబడే గుంటూరు లో కూడా ఇదే పరిస్థితి. ఇక నెల్లూరు జిల్లాలో వసూళ్లు పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నాయి.
అలాగే నైజాం ప్రాంతం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కేవలం కొన్ని మెయిన్ థియేటర్స్ మినహా, మిగిలిన అన్ని థియేటర్స్ లో ఈ సినిమాకి కనీసం 20 శాతం ఆక్యుపెన్సీలు కూడా రాకపోవడం గమనార్హం. ఇక తెలంగాణ జిల్లాల్లో అయితే మరీ దారుణమైన పరిస్థితి ఉంది. ఇలా ఓవరాల్ గా సోమవారం పరీక్ష లో ఈ చిత్రం రాయలసీమ లో మినహా, మిగిలిన అన్ని ప్రాంతాలలో ఫెయిల్ అయ్యినట్టే. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నేషనల్ హాలిడే అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ హాలిడే ని ఈ చిత్రం ఎంత వరకు ఉపయోగించుకుంటుంది అనే దానిపైనే ఈ సినిమా ఫుల్ రన్ ఆధారపడుంది, చూడాలి మరి.