Evol movie : ఆ సీన్స్ ఉన్నాయని సినిమాను రిజెక్ట్ చేసిన సెన్సార్ బోర్డు.. అయినా ఓటీటీలో రిలీజ్.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఎవోల్ సినిమాలో రెండు జంటల మధ్య కథ సాగుతుంది. ఈ తరుణంలో కొన్ని రొమాన్స్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఒక్కోసారి బోల్డ్ కంటెట్ కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కొన్ని పోస్టర్ల రిలీజ్ ను బట్టి తెలుస్తోంది. ఇక సెన్సార్ బోర్డు కూడా అనుమతి ఇవ్వలేదంటే ఎలాంటి సీన్స్ పెట్టారో తెలుసుకోవచ్చు.

Written By: Chai Muchhata, Updated On : August 13, 2024 11:45 am

Evol Movie

Follow us on

Evol movie : సినిమా టికెట్ల రేట్లు పెరిగిన తరుణంలో ఓటీటీలకు ప్రాధాన్యత పెరిగింది. కరోనా కాలం సమయంలో థియేటర్లు మూతపడడంతో ఎక్కువ మంది ఓటీటీలపైనే ఆధారపడ్డారు.అప్పటినుంచి వీటికి అడిక్ట్ అయిపోయారు. సినిమా థియేటర్ల కంటే ఓటీటీలో తక్కువ ఖర్చులో ఫ్యామిలీ మొత్తం చూసేయచ్చు అన్న ధోరణలో వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో కొందరు సినిమా డైరెక్టర్లు, నిర్మాతలు ఓటీటీని బేస్ చేసుకొని సినిమాలు, వెబ్ సిరీస్ లు తీస్తున్నారు. ఇక్కడ రిలీజ్ అయిన సక్సెస్ కొట్టిన మూవీస్ లేకపోలేదు. అంతేకాకుండా అయితే థియేటర్లో కొన్ని సందర్భాల్లో పలు కారణాలతో విడుదల కాని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఎందుకంటే థియేటర్ లో సినిమా రిలీజ్ కావాలంటే సెన్సార్ బోర్టు అనుమతి కావాలి. అయితే తాజాగా సెన్సార్ బోర్డు ఓకే చెప్పలేదు. అయినా దీనిని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏదీ? ఎందుకు సెన్సార్ బోర్డు దీనిని రిజెక్ట్ చేసింది.

ఒక సినిమా విడుదలయ్యే ముందు సెన్సార్ బోర్డ్ సర్టిఫై ఇవ్వాల్సి ఉంటుంది. అందులోని వయలెన్స్ కంటెంట్ ఏదైనా ఉంటే వాటిని తీసేస్తానంటేనే విడుదలకు అవకాశం ఇస్తారు. అలాగే కొన్నిరకాల బోల్డ్ సీన్స్ ను కూడా సెన్నార్ బోర్డు అనుమతించదు. అయితే తాజాగా ‘ఎవోల్ ’ అనే సినిమా గురించి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రామ్ వెలగపూడి అనే డైరెక్టర్ ఈ సినిమా తీశారు. ఇందులో నటించిన వారంతా కొత్తవారే. ఈ సినిమాలో జెన్నీఫర్ ఇమ్యాన్యుయేల్ హీరోయిన్ ప్రధాన ఆకర్షణీయంగా కనిపిస్తుంది. జూలై నెలలో దీనిని థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ బోర్డు అనుమతించలేదు.

ఎవోల్ సినిమాలో రెండు జంటల మధ్య కథ సాగుతుంది. ఈ తరుణంలో కొన్ని రొమాన్స్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఒక్కోసారి బోల్డ్ కంటెట్ కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కొన్ని పోస్టర్ల రిలీజ్ ను బట్టి తెలుస్తోంది. ఇక సెన్సార్ బోర్డు కూడా అనుమతి ఇవ్వలేదంటే ఎలాంటి సీన్స్ పెట్టారో తెలుసుకోవచ్చు. అయితే నేటి కాలంలో జరుగుతున్న పరిస్థితులపై ఈ మూవీని తీశామని డైరెక్టర్ రామ్ ఈ మూవీ ఫంక్షన్లో తెలిపారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న రహస్య ఒప్పందంపై ఈ సినిమా సాగుతోంది.

ఎవోన్ సినిమాను సెన్సార్ బోర్డు అనుమతించకపోవడంతో దీనిని నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దీని హక్కులు దక్కించుకుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ గురించి అనౌన్స్ మెంట్ చేశారు. అయితే ఇప్పటికే కొన్ని వీడియోలు, సీన్స్ చూస్తే యూత్ ను బగా ఆట్రాక్ట్ చేస్తాయని తెలుస్తోంది. దీంతో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలో రిలీజ్ అయిన తరువాత ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని సోషల్ మీడియాలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మరి ఈ సినిమాలో ఎలాంటి సీన్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే.