https://oktelugu.com/

Prabhas vs Shah Rukh Khan : అక్కడ షారుఖ్ ఖాన్ టాప్ హీరో… ఆ రికార్డ్ ను బ్రేక్ చేసే సత్తా ప్రభాస్ కి ఉందా..?

షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో చేసిన ప్రతి సినిమా బాలీవుడ్ లో చాలా మంచి విజయాన్ని అందుకుంటుంది...నిజానికి సౌత్ సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ లో పాగా వేయడానికి ముందు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ నెంబర్ వన్ హీరోగా ఉండేవాడు...

Written By:
  • Gopi
  • , Updated On : August 13, 2024 / 11:50 AM IST

    Prabhas vs Shah Rukh Khan

    Follow us on

    Prabhas vs Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షాగా షారుఖ్ ఖాన్ చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఒకే ఒక హీరోగా కూడా షారుఖ్ నిలవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆ మధ్య కొంచెం ప్లాపులతో సతమతమైనప్పటికీ వరుసగా పఠాన్, జవాన్ లాంటి సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ రికార్డులను సాధించాడు. నిజానికి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా సక్సెస్ లు కొడుతున్నారా అంటే అది ఒక షారుఖ్ ఖాన్ మాత్రమే భారీ హిట్లు కొడుతున్నాడని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో బాలీవుడ్ హీరోలందరూ చతికిలబడిపోతున్న సమయంలో షారుక్ ఖాన్ మాత్రం భారీ సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇక పఠాన్, జవాన్ రెండు సినిమాలతో 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానీ రికార్డును తను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులైతే వచ్చాయి.

    కలెక్షన్ల పరంగా చూసుకున్న సినిమా వ్యూయర్షిప్ పరంగా చూసుకున్న చాలా మార్పులు రావడం ఇంకా ఓటిటి లు కూడా అందుబాటులోకి రావడంతో థియేటర్ కి వెళ్లి సినిమాలను చూసే జనాల సంఖ్య చాలా వరకు తగ్గింది అనే చెప్పాలి… ఇక కరోనా తర్వాత ఓవర్సీస్ లో అత్యధికంగా భారీ వసూళ్లను సాధించిన ఇండియన్ సినిమాలలో మొదటి రెండు స్థానాల్లో షారుఖాన్ నిలవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

    పఠాన్ సినిమా 415 కోట్లతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఇక జవాన్ సినిమా 405 కోట్లతో రెండోవ స్థానంలో నిలిచింది. ఓవర్సీస్ లో ఈ రేంజ్ లో భారీ సక్సెస్ లను సాధించడమే కాకుండా భారీ వసూళ్లను కూడా సాధించిన హీరో గా షారుక్ ఖాన్ నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…ఇక 352 కోట్ల వసూళ్లను సాధించిన సినిమాగా ‘త్రిబుల్ ఆర్’ సినిమా మూడోవ స్థానంలో నిలిచింది. ఇక కల్కి 245 కోట్ల వసూళ్లను సాధించి నెంబర్ 5 పొజిషన్ లో నిలవడం విశేషము…

    ఇలా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ టెన్ లో షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన రెండు సినిమాలు నెంబర్ వన్, నెంబర్ 2 పొజిషన్ లో నిలవడం అనేది నిజంగా బాలీవుడ్ కి ఓవర్సీస్ లో ఉన్న మార్కెట్ ను చాలా పెద్ద ఎత్తున చూపిస్తుంది…ఇక శాండిల్ వుడ్ నుంచి వచ్చిన కే జి ఎఫ్ 2 220 కోట్లు వసూలు చేసింది. అలాగే ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా కూడా 130 కోట్ల కలెక్షన్లు రాబట్టింది… మరి షారుఖాన్ రికార్డును బ్రేక్ చేయాలంటే ప్రభాస్ ఇంకెన్ని రోజుల సమయం తీసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…