https://oktelugu.com/

‘కాజల్’కు అవకాశాలు అందుకే వస్తున్నాయట !

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘కాజల్ అగర్వాల్’ ఫేడ్ అవుట్ దశలో ఉందనేది ఎప్పటినుండో వినిపిస్తోన్న మాట. అయినా సినిమాలు ఇంకా కాజల్ కి వస్తూనే ఉన్నాయి. ఆ రకంగా కాజ‌ల్ కెరీర్ కు ప్రస్తుతం అంతా బోన‌స్ పిరియ‌డే అనుకోవాలి. అయితే యంగ్ హీరోల స‌ర‌స‌న మాత్రం కాజ‌ల్ కు ఈ మధ్య అవ‌కాశాలు తగ్గాయి. ఎలాగూ ముదురు హీరోల‌కు హీరోయిన్ల కొర‌త ఉండటంతో సీనియర్ హీరోలకు జోడీగా కాజ‌ల్ కు కాలం క‌లిసి వస్తోంది. దీనికితోడు […]

Written By: , Updated On : September 23, 2020 / 05:51 PM IST
Follow us on


సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘కాజల్ అగర్వాల్’ ఫేడ్ అవుట్ దశలో ఉందనేది ఎప్పటినుండో వినిపిస్తోన్న మాట. అయినా సినిమాలు ఇంకా కాజల్ కి వస్తూనే ఉన్నాయి. ఆ రకంగా కాజ‌ల్ కెరీర్ కు ప్రస్తుతం అంతా బోన‌స్ పిరియ‌డే అనుకోవాలి. అయితే యంగ్ హీరోల స‌ర‌స‌న మాత్రం కాజ‌ల్ కు ఈ మధ్య అవ‌కాశాలు తగ్గాయి. ఎలాగూ ముదురు హీరోల‌కు హీరోయిన్ల కొర‌త ఉండటంతో సీనియర్ హీరోలకు జోడీగా కాజ‌ల్ కు కాలం క‌లిసి వస్తోంది. దీనికితోడు వ‌య‌సు మీద ప‌డిన బాలయ్య లాంటి హీరోలకు కాజ‌ల్ ఒక ఛాయిస్ అవుతుంది. అందుకే ఇప్పటికే చిరంజీవి, క‌మ‌ల్ హాస‌న్ వంటి స్టార్లు కాజ‌ల్ ను త‌ప్ప‌నిస‌రిగా తమ సినిమాలో తమ సరసన హీరోయిన్ గా పెట్టుకోవాల్సి వచ్చింది.

Also Read: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నిర్మాతకు లింకులు?

మొత్తానికి ఇలాంటి అవ‌కాశాల‌తో కాజ‌ల్ తన కెరీర్ ను ఇంకా కొనసాగిస్తోంది. ఇదే క్ర‌మంలో ఆమె తుపాకీ సీక్వెల్ లో కూడా నటిస్తోంది. విజ‌య్ హీరోగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తుపాకీ సినిమా సీక్వెల్ లో కాజల్ ను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఈ సీక్వెల్ పార్ట్ కు లాక్ డౌన్ కి ముందే రంగం సిద్ధం చేసిన మురుగ‌దాస్, త్వరలో షూటింగును కూడా మొద‌లుపెట్టాలని చూస్తున్నాడు. ఎలాగూ ఈ సినిమా మొద‌టి పార్ట్ లో కూడా కాజ‌ల్ నే హీరోయిన్. ఫ‌స్ట్ పార్ట్ లోని కొన్ని పాత్ర‌లు సీక్వెల్ లో కూడా కొన‌సాగించాలని మురగదాస్ నిర్ణయించుకున్నాడట. కాజ‌ల్ పాత్ర కూడా ఆ కోటాలోనే ఉంటుంద‌ట.

అయితే తాజాగా కాజల్ అగర్వాల్ కి మ‌రో భారీ బ‌డ్జెట్ సినిమాలో అవ‌కాశం వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మంచి కమర్షియల్ పొలిటికల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళీ స్టార్ మోహన్ లాల్ ను తీసుకోవాలనుకుంటున్నాడు త్రివిక్రమ్. మోహన్ లాల్ కోసం ఇప్పటికే ఓ కీలక పాత్రను కూడా రాశాడట. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని, ఆ పాత్ర సరసన ఒక హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని.. ఇప్పుడు ఆ పాత్రలో కాజల్ అగర్వాల్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది.

Also Read: కరోనా తో సీనియర్ నటి మృతి

మొత్తానికి కాజ‌ల్ కు వ‌ర‌స‌గా భారీ సినిమాల్లోనే ఛాన్సులు ద‌క్కుతున్నాయి. ఎంతైనా సినిమా కోసం కాజల్ ఏమి చేయడానికైనా ఎప్పుడు ముందుంటుంది. అవసరమైతే అదనపు రోజులను కూడా సినిమాకి కేటాయిస్తోంది. పైగా షూటింగ్స్ సమయంలో హోటల్స్, ప్లైట్స్ అంటూ ఎక్కువ డిమాండ్స్ కూడా చేయదు. హీరోలతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. అందుకే వయసు ముదిరిన ఈ భామకు ఇంకా చాన్స్ లు వస్తూనే ఉన్నాయి.