Ram Charan's emotional comments on Allu Arjun's arrest
Allu Arjun : పాన్ ఇండియా లెవెల్ లో మంచి స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న హీరోల లిస్ట్ తీయమంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్. ఈ ముగ్గురికి పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ స్టేటస్ వచ్చింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా హిందీ వెర్షన్ లో 50 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక అల్లు అర్జున్ గురించి చెప్పేది ఏముంది. పుష్ప సిరీస్ తో ఆయన శాశ్వతంగా బాలీవుడ్ పై తన జెండా పాతేసాడు. ఏ రేంజ్ లో అంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ కూడా వణికిపోయే రేంజ్ అన్నమాట. ఒకే ఫ్యామిలీ నుండి వచ్చిన అల్లు అర్జున్, రామ్ చరణ్ లలో అల్లు అర్జున్ రామ్ చరణ్ కంటే ఒక అడుగు ముందు ఉన్నాడు.
ఇద్దరు సరిసమానమైన టాలెంట్ ఉన్న నటులు, ఎలాంటి పాత్రని అయినా అవలీలగా పోషించగల సత్తా వీళ్లకు ఉంది. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అయినప్పటికీ అల్లు అర్జున్ ఎందుకు ఒక అడుగు ముందు ఉన్నాడు అంటే ఆయనలో ఉన్న కసి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రామ్ చరణ్ లో అదే మిస్ అవుతుంది, అభిమానులు ఈ మాట అన్నందుకు మమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు. కానీ అదే నిజం. ఉదాహరణకు ‘పుష్ప’ సినిమానే తీసుకుందాం. ఈ చిత్రాన్ని హిందీ లో విడుదల చేయాలనే ఆలోచన డైరెక్టర్ సుకుమార్ కి లేదు. తెలుగు వెర్షన్ కే సమయం సరిపోవడం లేదు, ఇక హిందీ వెర్షన్ ఎక్కడ అవ్వుద్ది, మన సినిమాలు అక్కడ ఎలాగో ఆడవు అని తేలికగా తీసుకున్నాడట. కానీ అల్లు అర్జున్ పట్టుబట్టి, సుకుమార్ తో, అలాగే నిర్మాతలతో పోరాడి, ఈ చిత్రాన్ని హిందీ లో విడుదల అయ్యేలా చేసాడు. ఫలితం మనమంతా చూస్తూనే ఉన్నాం.
అలా రామ్ చరణ్ చేయలేకపోయాడు. ఆయన నటించిన ‘రంగస్థలం’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఆయన నటించిన నటన గత దశాబ్ద కాలంలో ఏ హీరో కూడా నటించలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమాని హిందీ లో విడుదల చేసి ఉండుంటే రామ్ చరణ్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి వండర్స్ క్రియేట్ చేసేవాడు. కానీ నిర్మాతలు ఆ దిశగా ఆలోచించలేదు. రామ్ చరణ్ అయితే అసలు పట్టించుకోలేదు. అల్లు అర్జున్ లాగా ఆయన కూడా ‘రంగస్థలం’ చిత్రాన్ని హిందీ లో డబ్ చేయమని నిర్మాతలపై ఒత్తిడి చేసి ఉంటే , వాళ్ళు విడుదల చేసి ఉండేవారు, రామ్ చరణ్ కి బాలీవుడ్ లో అల్లు అర్జున్ స్థాయి క్రేజ్ ఏర్పడేది. అతనిలో ఉన్న కసి ఇతనిలో లేకపోవడం వల్లే నేడు ఇద్దరి మధ్య ఇంత వ్యత్యాసం ఏర్పడింది.