Allu Aravindh
Allu Aravind : ఇటీవల జరిగిన ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దిల్ రాజు ని ఉద్దేశించి చేసిన కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ సోషల్ మీడియా లో ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. దిల్ రాజు గురించి మాట్లాడుతూ ‘ఈ సంక్రాంతికి ఒక సినిమాని ఇలా(కిందకి చూపుతూ) ఇచ్చి, మరో సినిమాని అలా (పైకి చూపుతూ) ఇచ్చి, ఆ తర్వాత ఐటీ అధికారులను వెల్కమ్ చేసి సెన్సేషన్ సృష్టించాడు.’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన ఏ రెండు సినిమాలను ఉద్దేశించి అలా కామెంట్ చేసాడో మన అందరికీ తెలిసిందే. ‘గేమ్ చేంజర్’ డిజాస్టర్ అయ్యిందని చెప్పకనే చెప్పాడు. దీనిపై సోషల్ మీడియా లో మెగా అభిమానులు ట్రిగర్ అయ్యారు. సొంత చెల్లి కొడుకు సినిమా ఫ్లాప్ అయితే, మేనమామకు ఎంత సంతోషమో చూడండి అంటూ మెగా ఫ్యాన్స్ ఆవేదనతో కామెంట్స్ చేసారు.
దీనిపై అల్లు అరవింద్ స్పందిస్తాడు, అభిమానులకు తన ఉద్దేశ్యం ఏమిటో చెప్తాడు అని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్టే ఆయన స్పందించాడు. కానీ ఆ స్పందన పుండు మీద గొడ్డు కారం చల్లినట్టుగా అనిపించింది. రేపు ‘తండేల్’ మూవీ విడుదల సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. ఈ సమావేశంలో ఆయన్ని ఒక ప్రముఖ రిపోర్టర్ ప్రశ్న అడుగుతూ ‘మొన్న ఒక ఈవెంట్ లో మీరు కాస్త నోరు తూలినట్టు ఉన్నారు. సోషల్ మీడియాలో దానిపై పెద్ద రచ్చ జరుగుతుంది. మీపై ట్రోలింగ్స్ కూడా జరుగుతున్నాయి..వాటిని మీరు గమనించారా?’ అని అడగ్గా, దానికి అల్లు అరవింద్ సమాధానం చెప్తూ ‘హా గమనించాను’ అని అంటాడు. ‘మరి మీరు ఆ వ్యాఖ్యలు కావాలని ఉద్దేశించి మాట్లాడినవా?, లేకపోతే యాదృచ్చికంగా మాట్లాడిందా’ అని అడగ్గా, దానికి అల్లు అరవింద్ సమాధానం చెప్తూ ‘నో కామెంట్స్’ అని అన్నాడు.
అంటే దాని ఉద్దేశ్యం ఏమిటి?, అభిమానులు ఎలా అర్థం చేసుకోవాలి?, మీరు ఏమైనా అనుకోండి ‘ఐ డోంట్ కేర్’ అనే యాటిట్యూడ్ తో అల్లు అరవింద్ అన్న మాటలుగా భావించవచ్చా?, ఒకప్పటి అల్లు అరవింద్ అయితే అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్న సందర్భంలో వివరణ ఇస్తూ, సర్దిచెప్పేవాడు. కానీ ఇప్పుడు సర్దిచెప్పే ఆలోచనలు కూడా ఆయనకు లేవంటే, కచ్చితంగా మెగా , అల్లు కుటుంబాల మధ్య, ఎదో పెద్ద వివాదమే జరిగినట్టు అనిపిస్తుంది. గడిచిన నాలుగు దశాబ్దాలలో అల్లు అరవింద్ చిరంజీవి,రామ్ చరణ్ లపై ఇంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అనే విషయాన్ని తెలుసుకొని వెంటనే హుటాహుటిన బయలుదేరిన ఏకైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఇక సురేఖ గారు అయితే రాత్రంతా అల్లు అర్జున్ గురించి బెంగ పెట్టుకొని తన ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇంత ప్రేమాభిమానులు చూపించిన తర్వాత కూడా అల్లు అరవింద్ నుండి ఇలాంటి రియాక్షన్స్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Q: Your words at events became sensation. There is trolling going on social media. Your response on that#AlluAravind: No Comments
— (@BheeshmaTalks) February 6, 2025