Prashanth Neel Vs Sandeep Reddy Vanga: సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా అల్టిమేట్ గా ఆ సినిమా విజయం సాధించిందా? లేదా అనే దాని మీదనే డిస్కషన్ అయితే ఉంటుంది. ఒక సక్సెస్ ని సాధించిన దర్శకుడికి ఇండస్ట్రీలో చాలా గొప్ప గౌరవమైతే దక్కుతోంది. అలాగే ఒక ఫెయిల్యూర్ ని చూసిన దర్శకుడిని ఎవ్వరు పట్టించుకోరు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పటివరకు చాలామంది హీరోలు చేసిన సినిమాలను వాళ్ల కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాలుగా నిలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక కన్నడ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకొని ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ 5 పొజిషన్ లో నిలిచిన దర్శకులలో ఆయన చేసిన ‘కేజిఎఫ్’ సిరీస్ అలాగే ‘సలార్’ సినిమాలు చాలా గొప్ప గుర్తింపునైతే సంపాదించుకున్నాయి. ఇక పాన్ ఇండియాలో ఈయన సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు…ఇక తెలుగు వెనుక ఇండస్ట్రీ లో బోల్డ్ కంటెంట్ తో సినిమాలను తెరకెక్కించి భారీ సక్సెస్ ను సాధించగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…
ఆయన చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి చాలా ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘అనిమల్’ సినిమాతో రణ్బీర్ కపూర్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాని అందించిన ఆయన ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు…ఇక ఈ ఇద్దరి దర్శకుల మధ్య ఒక తేడా అయితే ఉంది.
వీళ్లిద్దరూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కావాలని వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకున్నప్పటికి ఒక్కొక్కరు ఒక్కో సీన్ ని డిఫరెంట్ గా డీల్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ అయితే తన సినిమాలో చాలా గ్రాండీయర్ ను చూపిస్తూ ఎలివేషన్స్ ఎక్కువగా ఇస్తూ సీన్ ను ముందుకు నడిపిస్తాడు…ఇక సందీప్ రెడ్డి వంగ మాత్రం సీన్ లో ఎలాంటి గ్రాండీయర్ లేకుండా హీరో క్యారెక్టరైజేషన్ ను పోట్రే చేస్తూ ఆ సీన్ ను రక్తి కట్టిస్తూ ఉంటాడు.
తద్వారా సినిమాని చూసే ప్రేక్షకుడు ఆ సీన్ కి అడిక్ట్ అయిపోయి స్క్రీన్ మీద తనని తాను చూసుకుంటాడు. దానివల్ల ఆ సినిమా ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతోంది. ఈయన చేసిన సినిమాల్లో మనిషి యొక్క ఒరిజినాలిటి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన కి ఇండియాలో చాలా మంచి పాపులారిటి అయితే దక్కింది…