Prabhas: వ్యసనాలకు ఎవరూ అతీతులు కారు. తెలిసీ తెలియని వయసులో సరదాగా మొదలైన అలవాట్లు వ్యసనంగా మారిపోతాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని కూడా ఓ వ్యసనం వేధించిందట. ఈ విషయాన్ని బాహుబలి 2లో నటించిన ఓ నటి తెలియజేశారు. ఆమె యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ప్రభాస్ చాలా మంచివారు. సెట్స్ లో అందరితో కలిసిపోతారు. ఆయనకు పెద్ద హీరోనన్న గర్వం ఉండదు. అయితే ఆయనకు సిగరెట్ అలవాటు ఉంది. విపరీతంగా సిగరెట్స్ తాగేవాడు. ఒక విధంగా చెప్పాలంటే చైన్ స్మోకర్. షాట్ గ్యాప్ లో వరుసగా సిగరెట్స్ తాగేవారని, బాహుబలి 2 సినిమాలో చిన్న పాత్ర చేసిన సీనియర్ లేడీ ఆర్టిస్ట్ చెప్పారు.

ఇక ప్రభాస్ కి ఉన్న మరొక వ్యసనం ఫుడ్. ప్రపంచంలోని అన్ని రకాల వంటలను ఆయన రుచి చూడాలి అనుకుంటారు. తాను తినడమే కాకుండా తనతో పనిచేసే కో స్టార్స్ కి అరుదైన వంటకాలతో ఆతిథ్యం ఇస్తారు. ప్రభాస్ తో పని చేసిన శ్రద్దా కపూర్, శృతి హాసన్ తో పాటు పలువురికి ఈ అనుభవమైంది. ఆదిపురుష్ మూవీలో సైఫ్ అలీ ఖాన్ రావణ రోల్ చేస్తున్నారు. ఈ అనుబంధంతో ఆయనతో పాటు భార్య కరీనా కపూర్ కి ఇలాంటి రుచికరమైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.

ప్రభాస్ ఆతిథ్యం గురించి కరీనా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా స్పందించడం విశేషం. అలాగే ప్రభాస్ ని ఆమె పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఒకరి చెడు వ్యవసానాలను తప్పుబట్టడం సరైనది కాదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ స్మోకింగ్ వ్యసనం నుండి ఏళ్ల తరబడి బయటపడలేకపోయినట్లు స్వయంగా వెల్లడించారు. మహేష్ బాబుకి కూడా విపరీతంగా సిగరెట్స్ తాగేవారట. కొన్నాళ్లకు సిగరెట్ ని అసహ్యించుకొని వదిలేసినట్లు తెలియజేశారు. కొందరు స్టార్ హీరోలు, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ మద్యం, సిగరెట్ వంటి వ్యవసానాల కారణంగా కెరీర్ తో పాటు ప్రాణాలు కోల్పోయారు. ఏ అలవాటైన మితిమీరితే ప్రమాదమే కదా.