క్రేజీ హీరోయిన్ సాయి పల్లవికి కొన్ని పద్ధతులు నియమాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి.. అందాల ప్రదర్శన, అలాగే మరొకటి ముద్దు సీన్లు.. ఇలాంటి వాటికీ ఆమె పూర్తిగా దూరం. అయితే, ఇన్నాళ్లు తన నియమాలు తూచా తప్పకుండా పాటించిన సాయి పల్లవి, ‘లవ్ స్టోరి ‘ సినిమా విషయంలో మాత్రం పాటించలేకపోయింది. హీరోతో రెండు ముద్దు సీన్స్ లో ఆమె నటించింది.
ఇదే విషయాన్ని సాయి పల్లవి దగ్గర ప్రస్తావిస్తే… ముద్దు సీన్స్ లో తానూ నటించలేదు అని క్లారిటీ ఇచ్చింది. అది ఒక ట్రిక్ అని, తాను నాగ చైతన్యని ముద్దు పెట్టుకోలేదు అని ఆమె చెప్పుకొచ్చింది. కేవలం కెమెరా ట్రిక్, ఎడిటింగ్ మాయాజాలంతోనే మేకర్స్ నేను ముద్దు పెట్టుకున్న భావన కలిగించారు అని, అంతే తప్ప, అక్కడ నా నియమాన్ని తప్పలేదు అని సాయి పల్లవి చెప్పింది.
పైగా ఎట్టిపరిస్థితుల్లో నా రూల్ ని బ్రేక్ చేయను అని, మరోసారి స్పష్టం చేసింది. సాయి పల్లవి అద్భుతమైన నటి. అంతకన్నా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే వచ్చే ఎనర్జీకి ప్రేక్షకులు థ్రిల్ అయిపోతున్నారు. అందుకే, నిర్మాతలు, హీరోలు కూడా ఆమె డేట్లు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక సాయి పల్లవికి తన పంథా మార్చుకునే అవసరం ఏముంది ?
పైగా ఆమె సినిమాల ఎంపికలో కూడా నిక్కచ్చిగా ఉంటుంది. వచ్చిన సినిమాలని ఒప్పుకోవడం లేదు. కథ నచ్చాలి, తన పాత్ర నచ్చాలి. అన్నిటికీ మించి తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటేనే సినిమా చేస్తుంది. లేకపోతే, మెగాస్టార్ చిరంజీవి సినిమానే ఎందుకు తిరస్కరిస్తుంది ? ఏది ఏమైనా సాయి పల్లవి అంటే.. ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్. మరియు విలువలు ఉన్న నటి.
