క్యూట్ బ్యూటీ రష్మిక మందన్నా బాలీవుడ్ హీరోయిన్ గా బాగా పాపులర్ అవ్వాలని ఆశ పడుతుంది. దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ సినిమాల కోసం అందాల ప్రదర్శనకు ఎలాంటి అడ్డు చెప్పడం లేదు. పాత్ర డిమాండ్ చేసినా చేయకపోయినా.. ఎలా కావాలి అంటే.. అలా కనిపిస్తాను అంటూ హిందీ మేకర్స్ కి ఇప్పటికే రష్మిక క్లారిటీ ఇచ్చింది. అందుకే రష్మిక నటించిన మొదటి హిందీ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే, హిందీ దర్శక నిర్మాతలు ఈ బ్యూటీకి వరుస అవకాశాలు ఇస్తున్నారు.

మరోపక్క రష్మిక కూడా హిందీ సినిమాల కోసం కాస్త ఫిజిక్ ను మార్చుకుంటుంది. అలాగే ఆమె, తనలో హాట్ నెస్ ఎలివేట్ అయ్యేలా ఈ మధ్య ఫోటో షూట్ లు కూడా విచ్చలవిడిగా చేసుకుంటూ పోతూ ఉంది. ఇవన్నీ గమనించిన కొన్ని కంపెనీలు రష్మికతో యాడ్స్ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రష్మిక ఖాతాలో ఇప్పుడు పెద్ద బ్రాండ్లు వచ్చి చేరుతున్నాయి.
తాజాగా రష్మిక ఒక యాడ్ లో నటించింది. పైగా ఈ యాడ్ లో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ సరసన రష్మిక నటించింది. “మాచో” అనే బ్రాండ్ కి చెందిన ఇన్నర్స్ యాడ్ లో రష్మిక కనిపించింది. మొత్తానికి ఈ అండర్ వేర్ యాడ్ లో నటించడానికి రష్మికకి బాగానే గిట్టుబాటు అయిందట. రెండు కోట్లు వరకు ఆమె ఈ యాడ్ కోసం రెమ్యునరేషన్ తీసుకుందట.
కాకపోతే ఈ యాడ్ లో కంటెంటే ఇప్పుడు రష్మిక పరువు తీసేలా ఉంది. విక్కి కౌశల్ అండర్ వేర్ స్ట్రాప్ చూసి రష్మిక మోజుపడి పోతుంది. ముఖ్యంగా విక్కి చేతులు పైకి అన్నప్పుడుల్లా డ్రాయర్ కనిపించడం, ఆ డ్రాయర్ చూసినప్పుడల్లా రష్మిక తెగ ఇంప్రెస్ అయిపోతూ కనిపించడం ఇలా సాగింది యాడ్. అయినా డబ్బులు కోసం రష్మిక ఇలా అండర్ వేర్ యాడ్ లో కూడా నటించడం బాగాలేదు.
అయినా డ్రాయర్ చూసి ఎవరైనా లవ్ లో పడుతారా ? రష్మిక పిచ్చి కాకపోతే. జాతీయస్థాయి బ్రాండ్స్ కి యాడ్స్ చేస్తే.. స్థాయి పెరిగినట్లే అనుకుని రష్మిక ఈ యాడ్ చేసినట్టు ఉంది. కానీ ఇలాంటి యాడ్స్ చేస్తే ఉన్న స్థాయి కూడా పోతుంది.