
కొంతమంది హీరోయిన్ల బంధాలు మరీ విచిత్రంగా ఉంటాయి. కారణాలు అనేకం, కానీ ఏ కారణం చేతైనా సరైన ప్రవర్తన నుండి అదుపు తప్పకుండా ఉంటేనే, ఏ ఇండస్ట్రీలోనైనా ఏళ్ల పాటు ప్రయాణం ఉంటుంది. అలాంటి ప్రయాణం చేయాల్సిన చాలామంది హీరోయిన్లు తమ ఎఫైర్లు కారణంగా కెరీర్ ను పోగొట్టుకుని జీవితాన్నే కోల్పోయిన హీరోయిన్లు ప్రతి ఇండస్ట్రీలో కనిపిస్తారు.
ఇప్పుడు హాలీవుడ్ లో అలాంటి హీరోయిన్ ఒకరు, తన విచిత్ర ఎఫైర్ తో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ‘ట్విలైట్’ హీరోయిన్ ‘క్రిస్టెన్ స్టెవార్ట్’ రహస్య పెళ్లి చేసుకుంది. పైగా ఆమె తన గర్ల్‌ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. ‘క్రిస్టెన్ స్టెవార్ట్’ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టింది. మంచి నటి అనిపించుకుంది. అదృష్టం కలిసి వచ్చి ‘ట్విలైట్’, ‘స్నో వైట్ అండ్ ది హంట్స్‌మ్యాన్’ లాంటి సినిమాలతో హాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సాధించింది.
కానీ, ఓ ఇంటర్వ్యూలో తాను ఫెమినిస్ట్‌నని, బైసెక్సువల్ అని బహిరంగంగా ప్రకటించి అభిమానులకు భారీ షాక్ ఇచ్చింది. ఆ షాక్ తర్వాత వరుస ఎఫైర్లతో ఆమె వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ‘ట్విలైట్’ హీరో రాబర్ట్ పాటిన్‌సన్ తో చాన్నాళ్ల పాటు ఘాటు ఎఫైర్ నడిపింది. రాబర్ట్ బోర్ కొట్టాడట, వెంటనే ఆ తర్వాత డైరెక్టర్ రుపెర్ట్ శాండర్స్ తో ఘాడమైన సంబంధాన్ని పెట్టుకుంది. మధ్యమధ్యలో హీరో రాబర్ట్ పాటిన్‌సన్ తో మళ్ళీ డేటింగ్ చేస్తూ వచ్చింది.
ఇలా ఒకేసారి ఇద్దరితో రిలేషన్ ను మెయింటైన్ చేసిన ఈ క్రేజీ హీరోయిన్, ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ అలిసియా కార్గిలేతో కూడా ఎఫైర్ పెట్టుకుంది. అతనితో డేటింగ్ చేసిన పిక్స్ కూడా పబ్లిక్ గా వదలి మళ్ళీ వైరల్ అయింది. కొన్నాళ్ళు తర్వాత న్యూజిలాండ్ మోడల్ స్టెల్లా మాక్స్‌వెల్ తో కూడా డేటింగ్ చేసింది. చివరకు తన గర్ల్ ఫ్రెండ్ డైలాన్ మెయర్ ను పెళ్లి చేసుకుని, లాస్ ఏంజెల్స్ లో తన గర్ల్ ఫ్రెండ్ తోనే ఒకే ఇంట్లో కాపురం పెట్టింది.