Thaman latest updates: ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే కథ, కథనం, దర్శకత్వం తో పాటు ఆ సినిమా మ్యూజిక్ కూడా బాగుండాలి. అలా ఉన్నప్పుడే సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధిస్తాయి…ఈ మధ్యకాలంలో వస్తున్న కొన్ని సినిమాలు కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సూపర్ సక్సెస్ ని సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. రజినీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ సినిమా పెద్దగా ఎంగేజింగ్ గా లేకపోయిన కూడా అనిరుధ్ అందించిన బ్యా గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్క్ అవుట్ అయింది. దాంతో ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ విజయాన్ని సాధించి 400 కోట్ల వరకు కలెక్షన్లను కొల్లగొట్టింది… తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా తన మ్యూజిక్ తో కొన్ని సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలిపిన సందర్భాలు ఉన్నాయి. ‘అఖండ’ సినిమా బ్యా గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. సినిమా మొత్తం ఒకెత్తయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం మరొకెత్తుగా మారింది. తమన్ వల్లే ‘అఖండ’ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచిందని అప్పట్లో బాలయ్య చెప్పడం విశేషం… ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘ఓజీ’ సినిమా సైతం సక్సెస్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ కి తమన్ ఇచ్చిన బిజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో లేనటువంటి ఒక ఫ్రెష్ బిజిఎం ని అందించాడనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికైతే తమన్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా గురించి గతంలో ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో తమన్ ఎంతటి హైప్ క్రియేట్ చేశాడో దానికి మించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే కొట్టాడు… తనకున్న కళ తో ప్రేక్షకులందరిని రంజింపజేస్తున్న తమన్ ఇకమీదట రాబోయే సినిమాలతో కూడా యావత్ ఇండియన్ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక సినిమాలోని కోర్ ఎమోషన్ ని పట్టుకొని దానికి మ్యూజిక్ ని అందిస్తూ సాంగ్స్ లో వేరియేషన్స్ ను చూపిస్తూ సిచువేషన్ కు తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ పర్ఫెక్ట్ గా సెట్ చేసినట్లయితే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కూడా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు.
ప్రతి సీన్ కూడా టాప్ లెవెల్లో ఎలివేట్ అవుతోంది. ఈ ఒక్క విషయాన్ని తమన్ తెలుసుకున్నాడు. కాబట్టే అతని సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది… అటు నందమూరి ఫ్యామిలీ కి, ఇటు మెగా ఫ్యామిలీకి చాలా మంచి మ్యూజిక్ ని ఇస్తున్న తమన్ అక్కినేని ఫ్యామిలీ హీరోలకు మాత్రం అంత మంచి మ్యూజిక్ ఇవ్వడం లేదు.
దాంతో అక్కినేని అభిమానులు తమన్ మీద సీరియస్ అవుతున్నారు. ఇక ఇదంతా చూస్తున్న కొంతమంది సినిమా మేధావులు మాత్రం సినిమాలో దమ్మున్నప్పుడు ఆటోమేటిక్ గా బ్యాగ్రౌండ్ స్కోర్ సెట్ అవుతోంది…ఔట్ పుట్ బాగున్న సినిమాలకు మ్యూజిక్ కూడా చాలా బాగా కుదురుతుందని చెప్తున్నారు.
సినిమాలను బట్టే మ్యూజిక్ డైరెక్టర్లు బ్యాగ్రౌండ్ స్కోర్ ని ఎలా డిజైన్ చేయాలనేది ఆలోచిస్తారు అంటూ వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక అక్కినేని హీరోలు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలేవి పెద్దగా విజయం సాధించకపోవడంతో రోజు రోజుకి వాళ్ళ మార్కెట్ భారీగా డౌన్ అయిపోతుంది. మరి ఇప్పుడు వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోవాలంటే మాత్రం వరుస సక్సెస్ లను సాధించాల్సిన అవసరం ఉంది…