https://oktelugu.com/

Srinu Vaitla: శ్రీను వైట్ల సినిమాల్లో ఆ ఒక్కటి మాత్రం ఎప్పుడూ తగ్గదు…విశ్వం సినిమాలో కూడా రిపీట్ చేస్తున్నాడా..?

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లుగా పెరిగింది నాకు చాలామంది ఇప్పుడు సక్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇప్పుడు ఎలాగైనా సరే చేసి భారీ సక్సెస్ నందు కొన్ని మరోసారి పూర్వవైభవాన్ని అందుకోవాలని ప్రయత్నంలో ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : September 7, 2024 / 01:57 PM IST

    Srinu Vaitla

    Follow us on

    Srinu Vaitla: సినిమా ఇండస్ట్రీ లో కామెడీ దర్శకుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ శ్రీనువైట్ల…ఒకప్పుడు కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లను తెరకెక్కిస్తు స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేస్తూ భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు గత కొద్దిరోజుల నుంచి అసలు ఏమాత్రం తన ఫామ్ ను చూపించలేకపోతున్నాడు. వరుసగా చేసిన సినిమాలు చేసినట్టుగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు గోపీచంద్ ను హీరోగా పెట్టి చేస్తున్న విశ్వం సినిమా భారీ అంచనాలను సంతరించుకుంటుంది. ఈ సినిమా టీజర్ ని కనక చూసినట్లైతే ఈ సినిమా మీద మంచి అంచనాలైతే పెరుగుతున్నాయి. దాంతో పాటుగా శ్రీను వైట్ల మార్కు కామెడీ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గోపీచంద్ వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా ఒక మంచి సక్సెస్ అవ్వడం అనేది చాలావరకు కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే శ్రీను వైట్ల గత సినిమాల్లో కూడా కొన్ని కామెడీ క్యారెక్టర్ లను సృష్టించి వాటి ద్వారా కామెడి ని జనరేట్ చేస్తూ వచ్చాడు.

    ముఖ్యంగా ఢీ, దుబాయ్ శీను, ఆగడు లాంటి సినిమాల్లో కొన్ని కామెడీ క్యారెక్టర్లను సృష్టించాడు. ఇక ఇప్పుడు కూడా విశ్వం సినిమాలో ఏపీ మాజీ సిఎం అయిన జగన్ వాడిన డైలాగులను వాడుతూ కామెడీ పండించే ప్రయత్నం అయితే క్రియేట్ చేశాడు. అలాగే తెలంగాణ మాజీ మంత్రి అయిన మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి సవాల్ చేసిన డైలాగులను కూడా ఈ సినిమాలో వాడాడు. నిజానికి కాంటెంపరరీ ఇష్యూస్ ని తన సినిమాలో ఎక్కువగా వాడుతూ కామెడీని జనరేట్ చేయిస్తూ ఉంటాడు.

    ఇక శ్రీనువైట్ల ఈ సినిమాతో తన పూర్వవైభవాన్ని సంతరించుకుంటూ ఈ సినిమాలో భారీ కామెడీని సృష్టిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ హీరోలు ఎవరు అతనికి అవకాశాలనైతే ఇవ్వడం లేదు. కాబట్టి తను మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సినిమాలు ఏవి కూడా ఆశించిన మేరకు విజయం సాధించడం లేదు. మరి విశ్వం సినిమాతో మంచి సక్సెస్ ని సాధిస్తే ఆయనకు స్టార్ హీరోలు సైతం మళ్లీ డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

    దానికి అనుకూలంగానే ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలందరికీ వరుసగా ఫ్లాపులు ఇచ్చుకుంటూ వచ్చాడు. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు అతనికి డేట్స్ ఇచ్చే అవకాశాలైతే లేవు. విశ్వం సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి మరోసారి మహేష్ బాబుతో సినిమా చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మరి మహేష్ బాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీను వైట్లకు డేట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…