Nagarjuna Emotional: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఈ ఫ్యామిలీ నుంచి మూడు తరాల హీరోలు ఇండస్ట్రీకి వచ్చి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా అక్కినేని నాగేశ్వరరావు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలను చేసి తన ఎంటైర్ కెరీర్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించాడు. ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా నాగేశ్వరరావు కోసం లేడీ అభిమానులు పడి చచ్చిపోయేవారు. అప్పట్లో అతనికి అంత మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇక ఆయన తర్వాత నాగార్జున ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పటికీ స్టార్ హీరోగా వెలుగొందుతుండటం విశేషం… ఇక ఇప్పుడు నాగచైతన్య, అఖిల్ లాంటి హీరోలు సైతం తమను తాము ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే షోకి గెస్ట్ గా వచ్చిన నాగార్జున వాళ్ళ నాన్న అయిన నాగేశ్వరరావు ను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ‘మనం’ సినిమా అనేది అక్కినేని ఫ్యామిలీకి చాలా మెమొరబుల్ సినిమా అని, ఆ సినిమా చేస్తున్న సమయంలోనే నాగేశ్వరరావు గారికి ఇది చివరి సినిమా అవుతుందని నాగార్జున అనుకున్నారట.
ఎందుకంటే అప్పటికే అతను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉండటం వల్ల నాగేశ్వరరావు గారు ఎక్కువ రోజులు బతకలేరు అని నాగార్జున డిసైడ్ అయిపోయారట. మొత్తానికైతే ఆయన హాస్పిటల్ బెడ్ మీద పడుకొని మనం సినిమాకి డబ్బింగ్ అయితే చెప్పారట. ముందుగానే నాగార్జునతో డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పిస్తానంటే కుదరదు. నా పాత్రకి నేనే డబ్బింగ్ చెబుతానని చెప్పాడట.
Also Read: డీమన్ స్లేయర్ కిమెట్స్ నో యైబా – ఇన్ఫినిటి క్యాసిల్ ట్రైలర్ లో ఆ ఒక్కటి గమనించారా..?
ఆయన డబ్బింగ్ మొత్తం పూర్తి చేసి సినిమాని చూసి సినిమా బాగా వచ్చింది సూపర్ గా ఉంది అని నాగార్జునకి చెప్పారట. ఈ ఎంటైర్ సిచువేషన్ ని గుర్తుచేసుకున్న నాగార్జున ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికైతే మనం సినిమా అనేది అక్కినేని ఫ్యామిలీ సినిమా అనే చెప్పుకోవాలి.
ఇక ఈ సినిమా దర్శకుడు అయిన విక్రమ్ కే కుమార్ కి నాగార్జునకి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడడానికి మనం సినిమా అనేది చాలా వరకు హెల్ప్ చేసిందని నాగార్జున చెబుతూ ఉండటం విశేషం…ఇక మొత్తానికైతే వాళ్ళ నాన్న అయిన నాగేశ్వరరావు తనతో పాటు లేకపోవడం తనకు తీరని లోటని చెబుతూ నాగార్జున బాధపడ్డాడు…