https://oktelugu.com/

Pavan Kalyan Last Movie: పవన్ కళ్యాణ్ ఆఖరి మూవీ అదేనా..?

Pavan Kalyan Last Movie: మన టాలీవుడ్ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊపు ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అజ్ఞాతవాసి సినిమా తర్వాత మూడేళ్ళ పాటు సుదీర్ఘ విరామం తీసుకొని ఆయన చేసిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరి హర […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 28, 2022 / 04:47 PM IST
    Follow us on

    Pavan Kalyan Last Movie: మన టాలీవుడ్ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊపు ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అజ్ఞాతవాసి సినిమా తర్వాత మూడేళ్ళ పాటు సుదీర్ఘ విరామం తీసుకొని ఆయన చేసిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరి హర వీర మల్లు సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శెరవేగంగా సాగుతుంది..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఒక్క షెడ్యూల్ పూర్తి అయ్యింది..మే 8 వ తారీఖు నుండి మరో కొత్త షెడ్యూల్ కూడా ప్రారంభం అవ్వబోతుంది..ఈ సినిమాని ఆగష్టు నెలలోపు పూర్తి చేసి దసరా కి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    Pavan Kalyan

    Also Read: Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ ఏడాది అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన సినిమా ఏమిటో తెలుసా?

    ఈ సినిమా తర్వాత ఆయన తనతో గబ్బర్ సింగ్ వంటి సెన్సషనల్ హిట్ సినిమాని తీసిన హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చెయ్యబోతున్నాడు..ఈ సినిమా షూటింగ్ కూడా అతి త్వరలోనే ప్రారంభం కానుంది..ఇక ఈ సినిమాలు తర్వాత ఆయన వినోదయ్యా సీతం మరియు తేరి వంటి సినిమాలను రీమేక్ చెయ్యబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది..ఈ సినిమాలు అన్ని పూర్తి అవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది..మరి 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ జనాల్లోనే ఉండాల్సి వస్తుంది కదా, అప్పుడు ఎలా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది..అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం భవదీయుడు భగత్ సింగ్ సినిమానే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెయ్యబొయ్యే ఆఖరి సినిమా అని ఇండస్ట్రీ లో ఒక్క టాక్ వినిపిస్తుంది..ఈమధ్య లో సమయం దొరికితే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తో ఒక్క సినిమా చేస్తాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది.

    Pavan Kalyan, Koratala Siva

    కొరటాల శివ పవన్ కళ్యాణ్ కోసం ఒక్క అద్భుతమైన పొలిటికల్ సబ్జెక్టు ని సిద్ధం చేసుకున్నాడట..ఎప్పటి నుండో ఆయన ఈ స్టోరీ ని పవన్ కళ్యాణ్ కి వినిపించడం కోసం ప్రయత్నిస్తున్నాడు అట..కానీ ఆయనకీ ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఆ అవకాశం రాలేదు అని..ఇప్పుడు ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయనని కలిసి కథ చెప్తాను అంటూ ఇటీవల ఆచార్య మూవీ ప్రొమోషన్స్ లో కొరటాల శివ గారు తెలిపారు..అన్ని కుదిరితే ఆ రీమేక్ సినిమాల కంటే ముందుగా కొరటాల శివ మూవీ నే సెట్స్ పైకి రావొచ్చు అని..ఇదే 2024 వ సంవత్సరం ఎన్నికల ముందు వచ్చే ఆఖరి సినిమా అవుతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో సాగుతున్న చర్చ..కొరటాల శివ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఈ సినిమా పూర్తి అయినా తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది..మరి ఈ క్రేజీ కాంబినేషన్ కార్యరూపం దాలుస్తుందో లేదో చూడాలి.

    Also Read: Samantha Birthday: దేవకన్యలా సమంత రచ్చ.. లుక్ చూసి మెంటలెక్కిపోతున్న ఫ్యాన్స్ !

    Recommended Videos:

    Tags