Anushka On Prabhas: అనుష్క శెట్టి లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో అనుష్క పాల్గొనలేదు. హీరో నవీన్ పోలిశెట్టి మాత్రం బాగా కష్టపడుతున్నాడు. ఎట్టకేలకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో మూవీ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలు పంచుకుంది. ఇంటర్వ్యూ చివర్లో ప్రభాస్ గురించి అడగ్గా ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ అసలు మారలేదని మొదట్లో ఎలా ఉన్నాడో పాన్ ఇండియా స్టార్ అయ్యాక కూడా అంతే గర్వం లేకుండా ఉన్నాడని ఆమె అన్నారు.
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ గురించి మీ అభిప్రాయం ఏంటని అడగ్గా… ప్రభాస్ నాకు 2005 నుండి తెలుసు. అప్పుడు ఎలా ఉన్నారో పాన్ ఇండియా హీరో అయ్యాక కూడా అలానే ఉన్నారు. ఎలాంటి మార్పు లేదు. ప్రభాస్ నాకు డియర్ డియర్ ఫ్రెండ్. ఆ భావన నా నుండి ఎప్పటికీ పోదు. అలానే ఉంటుంది. అలాగే కాల భైరవ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. భైరవకు నేషనల్ అవార్డు రావడం నాకు సంతోషాన్ని కలిగించింది. మన చుట్టూ ఉన్నవారు ఎదుగుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది, అని అన్నారు.
ప్రభాస్-అనుష్క మధ్య లవ్ ఎఫైర్ ఉందన్న రూమర్స్ నేపథ్యంలో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో మూడు చిత్రాలు వచ్చాయి. మూడు మంచి విజయాలు సాధించాయి. మొదటిసారి బిల్లా చిత్రం కోసం కలిశారు. ఆ మూవీలో అనుష్క సెమీ బికినీ వేయడం విశేషం. చాలా గ్యాప్ తర్వాత 2015లో బాహుబలి చేశారు. ఆ చిత్రం రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక బాహుబలి 2తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశాడు. ఈ చిత్రం రూ. 1800 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఇక పోతే అనుష్క పెళ్లి మాటెత్తడం లేదు. అటు వైపు ప్రభాస్ కూడా పెళ్లి విషయం పక్కన పెట్టేశాడు. తాజా ఇంటర్వ్యూలో పెళ్లి ఎప్పుడంటే.. నేను పెళ్ళికి వ్యతిరేకం కాదు. అయితే ఇప్పుడే ప్లాన్స్ లేవు. కుదిరినప్పుడు ఖచ్చితంగా చెబుతాను అన్నారు. 40 ఏళ్ళు దాటినా పెళ్లి ప్లాన్ చేయకపోవడం ఏంటని ఫ్యాన్స్ వాపోతున్నారు. అయితే పెళ్లి ఆలోచన మాత్రం ఉందని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి మూవీ సెప్టెంబర్ 7న విడుదల కానుంది.