https://oktelugu.com/

Unstoppable 4: అన్ స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోతే పుష్ప 2 కి భారీ నష్టం జరగబోతుందా..?

పాన్ ఇండియాలో సత్తా చాటుతున్న స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. 'పుష్ప' సినిమాతో ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇక మరోసారి 'పుష్ప 2' సినిమాతో బాలీవుడ్ హీరోలను సైతం శాసించే విధంగా ఈ సినిమాని డిసెంబర్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు...

Written By: , Updated On : November 10, 2024 / 12:26 PM IST
Unstoppable 4(3)

Unstoppable 4(3)

Follow us on

Unstoppable 4: పుష్ప 2 సినిమాతో తనకంటూ పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్న అల్లు అర్జున్ తనదైన రీతిలో సత్తా చాటడమే కాకుండా సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనే విధంగా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన ఆహా లో నెంబర్ వన్ షో గా గుర్తింపు సంపాదించుకున్న అన్ స్టాపబుల్ షో కి వచ్చి తన సినిమాకు సంబంధించిన విషయాలను తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. అయితే ఎపిసోడ్ నవంబర్ 15వ తేదీన స్ట్రీమింగ్ కాబోతున్నట్టుగా కూడా తెలియజేశారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అల్లు అర్జున్ ఈ షోలో ఎలాంటి మాటలు మాట్లాడబోతున్నాడు. ఎవరి గురించి ఎక్కువగా హైప్ చేస్తూ మాట్లాడుతాడు అనే విషయాల మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ప్రొని లో చూపించింది ఒకెత్తయితే ఎపిసోడ్ లో ఏం మాట్లాడుతాడు అనేది మరొక ఎత్తైంది…ముఖ్యంగా చిరంజీవి గురించి ఎలాంటి మాటలు మాట్లాడబోతున్నారు అనేది ఇక్కడ కీలకంగా మారబోతుంది. ఇక అలాగే పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా టాపిక్ తీస్తారా లేదా ఆయన గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ అల్లు అర్జున్ కి ఉందా లేదా అనే విషయాలు కూడా ఇక్కడ క్లారిటీగా తెలియబోతున్నాయి.

ఇక ఎప్పుడైతే అల్లు అర్జున్ వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేశాడో అప్పటినుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు అతన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మరి డిసెంబర్ 2 వ తేదీన ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ ఉన్న నేపధ్యంలో పుష్ప 2 సినిమా మీద ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ పడకూడదనే ఉద్దేశ్యంతోనే అల్లు అర్జున్ ఈ షోలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది.

మరి అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అభిమానులను సంతృప్తి పరిచే మాటలు మాట్లాడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గురించి ఆయన పాజిటివ్ గా మాట్లాడినట్టైతే మాత్రం అతని అభిమానులు అల్లు అర్జున్ కి అలాగే పుష్ప 2 సినిమాకి బ్రహ్మరథం పడతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కానీ ఒకవేళ మాట్లాడకపోతే మాత్రం మరింత నెగిటివ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ ‘అన్ స్టాపబుల్ షో’ కి తను రావడం అనేది ఒక రకంగా అతనికి ప్లస్ అవుతున్నప్పటికి మరొక రకంగా మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి…ఇక తన ఈగో ను పక్కన పెట్టి పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ ని రాబట్టాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ గురించి తప్పకుండా మాట్లాడాల్సిందే లేకపోతే మాత్రం కలెక్షన్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి…

 

Unstoppable With NBK S4 Icon Star Allu Arjun PROMO | Iddaru Firee | Nov 15th