Tangalan into OTT :  విడుదలైన రెండవ రోజే ఓటీటీలోకి ‘తంగలాన్’..మేకర్స్ కి ఇది కోలుకోలేని షాక్!

ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. సుమారుగా 35 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అయితే అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో 8 వారాల తర్వాతనే విడుదల చెయ్యాలి.

Written By: Vicky, Updated On : August 16, 2024 3:42 pm

Thangalaan Into OTT

Follow us on

Tangalan into OTT :  విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఎప్పుడూ థ్రిల్ కి గురి చేసే హీరోలలో ఒకరు విక్రమ్. ప్రతీ చిత్రంలోనూ ఆయన వైవిధ్యాన్ని కోరుకుంటూ ఉంటాడు. అందువల్ల ఆయనకి వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా పట్టించుకోకుండా తానూ ఎంచుకున్న మార్గం లోనే ముందుకు వెళ్తున్న ఏకైక నేటి తరం స్టార్ ఆయన. ఒకప్పుడు కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవాడు విక్రమ్. ఆ తర్వాత ‘శివ పుత్రుడు’ చిత్రం నుండి ఆయన రూట్ మారింది. కమల్ హాసన్ లాగ ప్రయోగాలకు ఎక్కువగా అలవాటు పడ్డాడు. అందులో భాగంగా రీసెంట్ గా ఆయన నటించిన ‘తంగలాన్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలై మంచి టాక్ ని తెచ్చుకుంది. స్క్రీన్ ప్లే బాగా స్లోగా ఉంది అనే టాక్ ఉన్నప్పటికీ కూడా, కథకి అది అవసరమైనట్టు ఉండడంతో మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 26 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అలాగే ఈ చిత్రాన్ని హిందీ లో ఈ నెల 30 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అది మేకర్స్ కి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. సుమారుగా 35 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అయితే అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో 8 వారాల తర్వాతనే విడుదల చెయ్యాలి. కానీ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడం తో నాలుగు వారాల తర్వాత విడుదల చేస్తే మరో 30 కోట్ల రూపాయిలు అదనంగా ఇస్తామని నెట్ ఫ్లిక్స్ సంస్థ మేకర్స్ కి ఒక ఆఫర్ ఇచ్చిందట. దీనిపై మేకర్స్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ తీసుకుంటే మాత్రం ఈ చిత్రం అక్టోబర్ నెలలో, లేదా సెప్టెంబర్ నెలాఖరులో నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే రెండవ రోజే ఇలా వివరాలు లీక్ అవ్వడం వల్ల సినిమా థియేట్రికల్ రన్ పై తీవ్రమైన ప్రభావం పడుతుందని, ఇది ఏమాత్రం మంచి పద్దతి కాదని, దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ మేకర్స్ ఫిలిం కౌన్సిల్ ని త్వరలోనే సంప్రదించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా విక్రమ్ కి చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా సూపర్ హిట్ దక్కింది. సుమారుగా 5 ఏళ్ళ నుండి ఆయన వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. స్టార్ స్టేటస్ కి ప్రమాదమయ్యే సమయం లో ఆయనకి ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడం అభిమానులకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తుంది.