https://oktelugu.com/

Mega Family vs Allu Arjun : మెగా ఫ్యామిలీ కి శాశ్వతంగా దూరమైన అల్లు అర్జున్..ఒకే ఒక్క ట్వీట్ తో క్లారిటీ!

గీతా ఆర్ట్స్ లో పనిచేస్తున్న బన్నీ వాసు నిర్మాణం లో వచ్చిన 'ఆయ్' చిత్రానికి మాత్రం ప్రొమోషన్స్ చేసాడు. ఆ సినిమాని ఆదరించండి అంటూ ఒక ట్వీట్ కూడా వేసాడు. దీనిని బట్టీ మనం అర్థం చేసుకోవచ్చు కావాలని ఆయన మెగా ఫ్యామిలీ కి దూరం కావాలని అనుకుంటున్నాడని

Written By:
  • Vicky
  • , Updated On : August 16, 2024 / 02:59 PM IST

    megha family vs allu arjun

    Follow us on

    Mega Family  vs Allu Arjun : ఎంత ఎదిగినా మూలాలు ఎప్పటికీ మర్చిపోకూడదు. అది మర్చిపోయిన రోజు గొప్ప స్థాయికి వెళ్ళొచ్చేమో కానీ, మనిషిగా మాత్రం విలువ కోల్పోతారు, ప్రస్తుతం అల్లు అర్జున్ అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడని మెగా అభిమానులు అంటున్నారు. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ లేకపోతే నేను లేను అని చెప్పుకొని తిరిగే అల్లు అర్జున్, ఈమధ్య కాలం లో రెండు మూడు హిట్ సినిమాలు వచ్చి స్టార్ స్టేటస్ పెరగగానే ఆయనలో చాలా మార్పులు కనిపించాయని, ఇప్పుడు నాకు మెగా ఫ్యామిలీ హీరోలతో అవసరమే లేదు అన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉంది అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటూ కేవలం ట్వీట్ మాత్రమే వేసాడు, కానీ వైసీపీ పార్టీ లో ఉన్న ఆయన స్నేహితుడు, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కి నంద్యాల కి వెళ్లి మద్దతు ప్రకటించడం ఎంత దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

    ఇలా చేస్తే కచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు నొచ్చుకుంటారు అనే విషయం ఆయనకి తెలుసు. శిల్పా రవి కూడా నువ్వొస్తే నీకు చాలా సమస్యలు వస్తాయి, నీపై వ్యతిరేకత పెరుగుతుంది అని అల్లు అర్జున్ కి చెప్పినప్పటికీ కూడా వినకుండా నంద్యాల కి వచ్చేసాడు. అవతల జనసేన పార్టీ ని పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు ఇండస్ట్రీ కి సంబంధించిన ఎంతో మంది నటీనటులు నెల రోజులు పిఠాపురం లోనే మకాం వేసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంటే, అల్లు అర్జున్ మాత్రం శత్రువులతో చేతులు కలిపాడు అంటూ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ మీద వాళ్లకి కోపం తగ్గలేదు. ఇదంతా అల్లు అర్జున్ కి తెలుసు, కానీ ఆయన ఈ సమస్య ని పరిష్కరించుకోవాలని అనుకోలేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా ఇటీవలే గ్రాండ్ గా విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. దీనిపై మెగా ఫ్యామిలీ హీరోలతో పాటుగా మహేష్ బాబు, నాని వంటి వారు కూడా ట్వీట్స్ వేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు.

    దానికి తోడు గీతా ఆర్ట్స్ లో పనిచేస్తున్న బన్నీ వాసు నిర్మాణం లో వచ్చిన ‘ఆయ్’ చిత్రానికి మాత్రం ప్రొమోషన్స్ చేసాడు. ఆ సినిమాని ఆదరించండి అంటూ ఒక ట్వీట్ కూడా వేసాడు. దీనిని బట్టీ మనం అర్థం చేసుకోవచ్చు కావాలని ఆయన మెగా ఫ్యామిలీ కి దూరం కావాలని అనుకుంటున్నాడని. అల్లు అర్జున్ లో ఉన్న ఈ పొగరు ‘పుష్ప: ది రూల్’ ప్లాప్ అయితే తగ్గుతుందని, ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే మాత్రం అల్లు అర్జున్ రాబోయే రోజుల్లో చిరంజీవి అంటే ఎవరు? అనే పరిస్థితులు వస్తాయని సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.