Thandel Movie : అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తండేల్’ కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత అక్కినేని ఫ్యామిలీ కి ఈ సినిమా ద్వారా పెద్ద హిట్ తగలడంతో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఈ సినిమా కేవలం అక్కినేని అభిమానులకు మాత్రమే కాదు, సినీ ప్రముఖులకు కూడా తెగ నచ్చేసింది. రీసెంట్ గానే తమిళ హీరో ధనుష్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా వంటి వారు ఈ చిత్రాన్ని చూసి, సినిమా అద్భుతంగా ఉంది అంటూ మూవీ టీం కి ఫోన్ కాల్ చేసి శుభాకాంక్షలు తెలియచేశారట. దీనికి మూవీ యూనిట్ ఎంతో సంతోషించారు. అంతే కాకుండా ఈ ప్రభుదేవా మాస్టర్ దేవి శ్రీ ప్రసాద్ కి ఫోన్ కాల్ చేసి, ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని పొగుడుతూ ప్రశంసల వర్షం కురిపించాడట.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా ని హీరో ధనుష్ రీమేక్ చేయడానికి అమితాసక్తిని చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం తెలుగు తో పాటు హిందీ, తమిళం లో కూడా ఏకకాలంలో విడుదలయ్యాయి. కానీ నాగ చైతన్య కి పెద్దగా ఆ ప్రాంతాల్లో పాపులారిటీ లేకపోవడం తో ఈ సినిమా అక్కడి ఆడియన్స్ కి కనీస స్థాయిలో కూడా రీచ్ అవ్వలేదు. అందుకే ధనుష్ ఈ రీమేక్ చేయడానికి మొగ్గు చూపుతున్నాడని సమాచారం. ఓటీటీ రాజ్యం ఏలుతున్న ఈరోజుల్లో రీమేక్ సినిమాలను ఆడియన్స్ అసలు పట్టించుకోవడం లేదు. కానీ చాలా కాలం తర్వాత తమిళ హీరో విజయ్ ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని రీమేక్ చేస్తుండడంతో ఈ ట్రెండ్ కి మళ్ళీ శ్రీకారం చుట్టినట్టు అనిపిస్తుంది. విజయ్ అంటే పెద్ద సూపర్ స్టార్, ఆయన కెరీర్ లో అదే చివరి చిత్రం కాబట్టి కచ్చితంగా ఆయన వరకు రీమేక్ సినిమా వర్కౌట్ అవుతుంది.
కానీ ధనుష్ తమిళనాడు లో మీడియం రేంజ్ హీరో, ఆయనకు ఇలాంటి రీమేక్ సినిమాలు ఎంత వరకు సెట్ అవుతాయో చూడాలి. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. సాయి పల్లవి రీమేక్ సినిమాల్లో నటించే అవకాశం లేదు. గతంలో చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రం చెల్లెలు పాత్ర చేసే అవకాశం వచ్చినా, ఆమె కేవలం రీమేక్ అనే కారణం చేత రిజెక్ట్ చేసింది. అందుకే ఈ సినిమా కోసం ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ని తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. గత కొంతకాలంగా కమర్షియల్ సక్సెస్ లేకపోవడం తో ఖాళీగా ఉన్నటువంటి కృతి శెట్టి, ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకొని సాయి పల్లవి ని మరిపించేలా నటిస్తే కచ్చితంగా ఆమె ఎదురు చూస్తున్న సక్సెస్ రావొచ్చు. చూడాలి మరి ఈ రీమేక్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది.