https://oktelugu.com/

Thandel Collection: ‘తండేల్’ 18 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..అక్కినేని అభిమానులు ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందేనా?

18 రోజులకు గాను ఈ సినిమాకి 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవాలంటే మరో పది కోట్ల రూపాయిల గ్రాస్ రాబట్టడం సాధ్యమేనా?, 10 కోట్ల రూపాయిల గ్రాస్ అంటే దాదాపుగా మరో 20 రోజుల థియేట్రికల్ రన్ ఉండాలి.

Written By: , Updated On : February 25, 2025 / 04:22 PM IST
Thandel Collection

Thandel Collection

Follow us on

Thandel Collection: అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తండేల్'(Thandel Movie) బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 18 రోజులు పూర్తి చేసుకుంది. విడుదలైన రోజు సాయంత్రమే ఈ సినిమాకి సంబంధించిన HD ప్రింట్ వచ్చేసింది, ఇక సినిమా థియేటర్స్ లో ఆడడం కష్టమే అని అనుకున్నారు కానీ, ఈ చిత్రం అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ డీసెంట్ స్థాయి థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంది. మొదటి వీకెండ్ లో వచ్చిన వసూళ్లను చూసి ఈ సినిమా 100 కోట్ల రూపాయిల గ్రాస్ కాదు, ఏకంగా షేర్ కొట్టేస్తుందని అక్కినేని అభిమానులు ఆశపడ్డారు. ఆ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఓపెనింగ్స్ వచ్చినంత ఊపు, మామూలు వర్కింగ్ డేస్ లో రాలేదు. దీంతో ఈ చిత్రం ఇప్పుడు ఆర్గానిక్ గా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

18 రోజులకు గాను ఈ సినిమాకి 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవాలంటే మరో పది కోట్ల రూపాయిల గ్రాస్ రాబట్టడం సాధ్యమేనా?, 10 కోట్ల రూపాయిల గ్రాస్ అంటే దాదాపుగా మరో 20 రోజుల థియేట్రికల్ రన్ ఉండాలి. ఎందుకంటే నేడు నుండి ఈ సినిమాకి 50 లక్షల గ్రాస్ వసూళ్లు కూడా రావడం కష్టమే. ఒకవేళ శివ రాత్రి కలిసి వస్తే కోటి రూపాయిల గ్రాస్ రావొచ్చు. ఆ పక్క రోజు నుండి మల్లి 30 లక్షల లోపు రోజువారీ గ్రాస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే వంద కోట్ల రూపాయిల గ్రాస్ చాలా దగ్గరగా వచ్చి ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ నిర్మాతలు పోస్టర్ ద్వారా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని అధిగమించామని చెప్పడంతో ఆడియన్స్ కూడా నమ్మేశారు. కాబట్టి అభిమానులు ప్రత్యేకించి ఫీల్ అవ్వాల్సిన పని లేదు.

కానీ ప్రముఖ వెబ్ సైట్స్ లో మాత్రం ఫుల్ రన్ లో వంద కోట్ల గ్రాస్ ని అప్డేట్ చేసే అవకాశం లేదు. కాబట్టి అక్కినేని అభిమానుల్లో చిన్నపాటి అసంతృప్తి ఉండొచ్చు. ప్రాంతాల వారీ గా ఈ సినిమాకి వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే నైజాం ప్రాంతంలో 20 కోట్ల రూపాయిలు, సీడెడ్ లో 6 కోట్ల 60 లక్షల రూపాయిలు, ఆంధ్రా లో 17 కోట్ల 55 లక్షలు, కర్ణాటక లో 4 కోట్ల 25 లక్షలు, ఓవర్సీస్ లో 4 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో సినిమాలు పెద్దగా ఏమి లేవు కాబట్టి, ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ కాస్త వచ్చే అవకాశాలు ఉన్నాయి.