https://oktelugu.com/

Hit 3 Teaser: ‘హిట్ 3’ టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్..24 గంటల్లో బీభత్సం..నాని ఇక స్టార్ హీరోల లీగ్ లోకి వచ్చినట్టే!

స్టార్ హీరోలకు తప్ప ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలకు ఈ స్థాయి రికార్డు వ్యూస్ రాలేదట. గతంలో విజయ్ దేవరకొండ లైగర్ చిత్రానికి 24 గంటల్లో 16 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : February 25, 2025 / 04:16 PM IST
    Hit 3 Teaser

    Hit 3 Teaser

    Follow us on

    Hit 3 Teaser: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit :The Third Case) టీజర్ నిన్న విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాని ని ఆయన అభిమానులు ఇంతటి ఊర మాస్ రోల్ లో చూస్తారని ఊహించి ఉండరు. అభిమానుల వరకు ఈ టీజర్ ఒక రేంజ్ లో సంతృప్తి పరిచింది కానీ, క్రిటిక్స్ నుండి మాత్రం అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ ని దక్కించుకోలేదు. హీరోయిజం కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ హీరో అలా క్రూరమైన పోలీస్ ఆఫీసర్ గా మారడానికి కూడా కారణాలు ఉండుంటాయని అభిమానులు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ టీజర్ కి యూట్యూబ్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లో దాదాపుగా 17 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయట.

    స్టార్ హీరోలకు తప్ప ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలకు ఈ స్థాయి రికార్డు వ్యూస్ రాలేదట. గతంలో విజయ్ దేవరకొండ లైగర్ చిత్రానికి 24 గంటల్లో 16 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ‘హిట్ 3 ‘ ఆ రికార్డు ని భారీ మార్జిన్ తో అధిగమించి సెన్సేషన్ సృష్టించింది. కానీ లైక్స్ లో మాత్రం టాప్ 2 తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 24 గంటల్లో ఈ టీజర్ కి వచ్చిన లైక్స్ 3 లక్షల 53 వేలు అట. అక్కినేని అఖిల్(Akkineni Akhil) ఏజెంట్ టీజర్ కి నాలుగు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇది ఇలా ఉండగా ‘హిట్ 3’ టీజర్ ఓవరాల్ టాలీవుడ్ టీజర్స్ అన్ని కలిపితే టాప్ 7 స్థానంలో నిల్చిందట. దీనిని బట్టీ చూస్తే నాని మీడియం రేంజ్ హీరోల లీగ్ నుండి టాప్ స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    ఎందుకంటే హిట్ 3 మీద మొదటి నుండి భారీ అంచనాలు అయితే లేవు. పాన్ ఇండియా సినిమా అంటూ ఊదరగొట్టి ప్రచారం కూడా చేసుకోలేదు, డైరెక్టర్ శైలేష్ కొలను(Director Sailesh Kolanu) గత చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇలా ఇన్ని నెగటివ్ మధ్య కూడా ఈ టీజర్ కి ఇంతటి రెస్పాన్స్ వచ్చిందంటే, కచ్చితంగా నాని రేంజ్ పెరిగింది అనే చెప్పాలి. ఆయన గత మూడు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్స్ గా నిలిచాయి. ప్రేక్షకుల్లో ఈ మూడు సినిమాలు నాని కి బ్రాండ్ ఇమేజి ని తెచ్చిపెట్టాయి. అందుకే హిట్ 3 దాకా వచ్చేసరికి నాని క్రేజ్ లో మార్పులు వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. అదే కనుక నిజమైతే ఇక నాని టాప్ స్టార్ హీరోల లిస్ట్ లోకి చేరిపోయినట్టే, ఇక నుండి ఆయన సినిమాలకు స్టార్ హీరోల రేంజ్ బజ్ ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.