Thandel Collection: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తండేల్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మూవీ టీం ప్రొమోషన్స్ చాలా గట్టిగానే చేస్తుంది కానీ, మౌత్ టాక్ ఆ రేంజ్ లో లేదు. సినిమా మొత్తం ‘బుజ్జి తల్లి’ అనే పదం తప్ప మరొకటి లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ట్రోల్స్ వినిపిస్తున్నాయి. దీనిపై అనేక ఫన్నీ మీమ్స్ కూడా వచ్చాయి. కానీ సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న సినిమాలకు ఈమధ్య ఓపెనింగ్ వసూళ్లు చాలా బలంగా వస్తున్నాయి. ‘తండేల్’ చిత్రానికి కూడా అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ బాగా వస్తున్నాయి. కానీ ఇతర భాషల్లో మాత్రం అసలు రావడం. ఈ సినిమాని మొదట్లో తెలుగు లో మాత్రమే విడుదల చేద్దామని అనుకున్నారు, కానీ ఆ తర్వాత హిందీ, తమిళం భాషల్లోకి డబ్ చేసారు.
తమిళం లో గ్రాండ్ గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి, ఈ ఈవెంట్ కి ప్రముఖ హీరో కార్తీ ని ముఖ్య అతిథి గా పిలిచారు. అదే విధంగా హిందీ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి, ఏకంగా అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ ని ముఖ్య అతిథిగా తీసుకొచ్చారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఈవెంట్స్ ని ఏర్పాటు చేయడానికి ఖర్చుపెట్టిన డబ్బులను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. హిందీ లో రెండు రోజులకు కలిపి కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. కనీసం ఫుల్ రన్ లో అయినా కోటి రూపాయిల మార్కుని అందుకుంటుందా అంటే అనుమానమే. తమిళం లో కూడా ఇదే పరిస్థితి. కనీసం లక్షల్లో కూడా గ్రాస్ ని రాబట్టలేదు. తమిళ నాడు నుండి మంచి వసూళ్లే వస్తున్నాయి కానీ, అది తెలుగు వెర్షన్ కి సంబంధించినవే.
ఓవరాల్ గా చూసుకుంటే పాన్ ఇండియన్ మార్కెట్ మన తెలుగు సినిమాలకు ఓపెన్ అయ్యింది కదా అని, ప్రతీ సినిమాని అందులో డబ్ చేస్తే ఆడియన్స్ ఆదరిస్తారని రూల్ లేదు. అక్కడి ఆడియన్స్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ పసిగట్టలేకున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రెండు రోజుల్లో 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 40 కోట్ల రూపాయలకు జరిగింది. వీకెండ్ కి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ కి అవకాశాలు ఉన్నాయి కానీ, భారీ వసూళ్లు వస్తాయా అంటే అనుమానమే.ఎందుకంటే ఫిబ్రవరి నెల అన్ సీజన్. అంతే కాకుండా సినిమాలో విషయం కూడా వేరే లెవెల్ ఏమి లేదు. కాబట్టి వర్కింగ్ డేస్ లో ఈ సినిమాకి భారీ వసూళ్లు నమోదు అవ్వడం కష్టమే.