Thandel Collection
Thandel Collection: అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తండేల్'(Thandel Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. పబ్లిక్ లో టాక్ యావరేజ్ రేంజ్ లో ఉన్నప్పటికీ, పాటలు అద్భుతంగా ఉండడంతో ఆడియన్స్ టాక్ ని పట్టించుకోకుండా ఈ సినిమాకి వెళ్లిపోయారు. ఫలితంగా నాగ చైతన్య తన కెరీర్ లో ఎప్పుడూ చూడని వసూళ్లను ఈ సినిమాకి చూసాడు. నిన్నటితో ఈ సినిమా విడుదలై మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరిందని నిర్మాతలు మొదటి వారంలోనే పోస్టర్ ని రిలీజ్ చేసారు కానీ, ఇప్పటి వరకు ఆ క్లబ్ లోకి చేరలేదని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట. వాళ్ళ అంచనా ప్రకారం ఈ సినిమాకి మూడు వారాల్లో 93 కోట్ల రూపాయిల గ్రాస్ ని మాత్రమే రాబట్టిందట.
Also Read: ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్ లో అకిరా నందన్ మొదటి చిత్రం ఫిక్స్..డైరెక్టర్ విషయంలో వీడిన సస్పెన్స్!
షేర్ లెక్కలో చూస్తే 53 కోట్ల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తుంది. ఎంత వసూళ్లు వచ్చినా ఈ వీకెండ్ లోనే రావాలి, ఆ తర్వాత దాదాపుగా క్లోజింగ్ వేసుకోవచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 15 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయట. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేకపోయింది ఈ చిత్రం. అందులో ఓవర్సీస్ ప్రాంతం ఒకటి. విడుదలకు ముందు 6 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత ఇప్పటి వరకు కేవలం 4 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సాధారణంగా పాటలు బ్లాక్ బస్టర్ గా నిల్చిన సినిమాలకు ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్, క్లోజింగ్ వసూళ్లు వస్తాయి. కానీ ఈ సినిమా అక్కడ ఫ్లాప్ గా మిగలడం అందరినీ షాక్ కి గురి చేస్తున్న విషయం.
అదే విధంగా హిందీ లో కూడా ఈ సినిమా భారీ నష్టాలను మిగిలించింది. హిందీ వెర్షన్ ప్రెస్ మీట్ లో ఏకంగా అమీర్ ఖాన్(Amir Khan) లాంటి సూపర్ స్టార్ ని పిలిపించి ఈ సినిమా గురించి మాట్లాడించారు. అయినప్పటికీ కూడా లాభం లేకుండా పోయింది. రెండు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. తమిళ వెర్షన్ కి కూడా ఇదే పరిస్థితి. తమిళనాడు లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి కానీ. తమిళ వెర్షన్ నుండి మాత్రం కనీసం కోటి రూపాయిల గ్రాస్ కూడా రాలేదట. అక్కడ కూడా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అందుకోలేదు కాబట్టి ఈ మూడు ప్రాంతాల్లో ‘తండేల్’ చిత్రం ఫ్లాప్ అయ్యింది అని చెప్పొచ్చు.