Who will take Chiranjeevi place: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత 50 సంవత్సరాల నుంచి ఎనలేని కీర్తి ప్రతిష్టలను అందుకుంటున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)… ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి మెగాస్టార్ మాత్రం ఒక్కరే ఉంటాడని గత 50 సంవత్సరాలు నుంచి ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు… ఆరు సంవత్సరాల్లో ఆరు ఇండస్ట్రీ హిట్లను దక్కించుకున్న ఘనత కూడా తనకే దక్కింది… ఇప్పటివరకు ఆ రికార్డును బ్రేక్ చేసిన హీరో ఇంకొకరు లేరు…ఇక ఇలాంటి సందర్భంలో చిరంజీవి చరిష్మాని మ్యాచ్ చేస్తూ ఆయన స్టార్ డమ్ ను బీట్ చేసే విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయితే కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు చిరంజీవి అంటే డాన్సులు ఫైట్లు చేస్తూనే ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా నటించి మెప్పించగలిగే కెపాసిటి ఉన్న నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. అందువల్లే ఆయన ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగడమే కాకుండా మెగాస్టార్ అనే బిరుదుని సంపాదించుకొని దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆయన తనను తాను మార్చుకుంటూ తన నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు. ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు తనకు కచ్చితంగా విజయాన్ని అందిస్తారు అనే ఒక ధోరణిలో ఆయన అనుక్షణం ఆలోచిస్తూ అలాంటి సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించాడు. ఇక ప్రేక్షకుల అభిరుచికి భిన్నంగా చిరంజీవి ఆర్ట్ సినిమాలు చేసిన ప్రతిసారి చేతులు కాల్చుకున్నాడనే చెప్పాలి.
Also Read: 3 BHK ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా? ఫట్టా?
చాలా మంది ప్రేక్షకులు మాస్ సినిమాలను కమర్షియల్ ఎంటర్టైనర్లను మాత్రమే కోరుకుంటున్నారని అలాంటి సినిమాలు చేసినప్పుడే తనకు సక్సెస్ లు దక్కుతాయని చాలా సార్లు ప్రూవ్ చేశారు… మన స్టార్ హీరోలందరు పాన్ ఇండియాని శాసించే స్థాయికి ఎదుగుతున్నప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవిని బ్రేక్ చేయడం మాత్రం వాళ్లకు సాధ్యం అవ్వదు…
చిరంజీవి అనే ఆయన ఒక శిఖరం లాంటి వ్యక్తి అతన్ని ఢీకొట్టాలి అంటే అంతా ఆషామాషీ వ్యవహారం అయితే కాదు…కాబట్టి అప్పటికి ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి మెగాస్టార్ మాత్రం చిరంజీవి ఒక్కడే…ఇక మిగతా హీరోలు అందరూ ఎన్ని గొప్ప ఘన కీర్తులు సాధించినా కూడా చిరంజీవిని మాత్రం బీట్ చేయడం ఎవ్వరీ వల్ల కాదు అనేది వాస్తవం…
Also Read: నితిన్ ‘తమ్ముడు’ మూవీ ట్విట్టర్ రివ్యూ..ఈసారైనా నితిన్ తలరాత మారిందా?
కాబట్టి ఈ జనరేషన్లో చిరంజీవిని ఢీకొట్టే హీరో మరొకరు లేరు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి…మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి ఈ ఏజ్ లో కూడా వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుండడం విశేషం…ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి తను మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకోనే ప్రయత్నం చేస్తున్నాడు…