Thammudu : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరో నితిన్(Actor Nithin). కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదల చేసిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన ‘రాబిన్ హుడ్'(Robinhood Movie) చిత్రం పై విడుదలకు ముందు నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, అదే విధంగా ప్రొమోషన్స్ లో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వబోతుంది, ఔట్పుట్ చాలా బాగా వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ‘భీష్మ’ లాంటి హిట్ తర్వాత వెంకీ కుడుముల తో చేస్తున్న చిత్రం అవ్వడం తో ఈ సినిమాపై బయ్యర్స్ లో కూడా భారీ నమ్మకం ఏర్పడింది. దానికి తోడు నితిన్ ఔట్పుట్ అద్భుతంగా వచ్చింది అని బలమైన నమ్మకం తో చెప్పడంతో 30 కోట్ల రూపాయలకు వివిధ ప్రాంతాల నుండి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేశారు.
Also Read : రీ రిలీజ్ లో కూడా సత్తా చాటుతున్న తమ్ముడు సినిమా…
కానీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. నిర్మాత ఈ చిత్రం కోసం 75 కోట్ల రూపాయిల ఖర్చు చేసాడు. నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం అనుకోవచ్చు. నితిన్ కి థియేట్రికల్ పరంగా అంత మార్కెట్ లేకపోయినప్పటికీ, ఓటీటీ, సాటిలైట్ రైట్స్ తో బడ్జెట్ రీకవర్ అయిపోతుందనే నమ్మకంతోనే అంత బడ్జెట్ పెట్టారు. అనుకున్నట్టు గానే ఓటీటీ, సాటిలైట్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడుపోయింది. కానీ సినిమా మాత్రం థియేటర్స్ నుండి కనీసం పది కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయింది. బయ్యర్స్ కి పాతిక కోట్ల రూపాయిల వరకు నష్టం వాటిల్లింది. ఇంతకు ముందు సినిమాలు ఫ్లాప్ అయ్యినప్పటికీ నితిన్ కృంగిపోలేదు, కానీ ఈ సినిమా ఫ్లాప్ మాత్రం ఆయన్ని మానసికంగా చాలా దెబ్బ తీసింది. ఆయన నటించిన కొత్త చిత్రం తమ్ముడు జులై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
‘రాబిన్ హుడ్’ చిత్ర ప్రొమోషన్స్ పై ఎంతో శ్రద్ద చూపించిన నితిన్, ‘తమ్ముడు'(Thammudu Movie) మూవీ ప్రొమోషన్స్ కి దూరంగా ఉండబోతున్నాడా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. రీసెంట్ గానే రిలీజ్ డేట్ ని ఒక స్పెషల్ వీడియో తో, ఫన్నీ గా విడుదల చేసారు. ఈ వీడియో లో ఈ చిత్రం లో పని చేసిన ప్రతీ ఒక్కరూ కనిపించారు, ఒక్క నితిన్ తప్ప. దీంతో అభిమానులు నితిన్ ఈ వీడియో లో ఎందుకు లేడు అంటూ సోషల్ మీడియా లో ఆయన్ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు. ‘రాబిన్ హుడ్’ ఎఫెక్ట్ నుండి నితిన్ ఇంకా బయటకు రాలేదా?, ఆ సినిమా అద్భుతంగా ఉంటుంది అనే అందరిలో నమ్మకం కల్గించిన నితిన్, మళ్ళీ అలాంటి నమ్మకాన్ని కలిగించే ధైర్యం చెయ్యలేకనే ఈ వీడియోలో రాలేదా?, భవిష్యత్తులో ప్రొమోషన్స్ కి కూడా దూరం కాబోతున్నాడా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు.
Also Read : షాక్… పవన్ తమ్ముడు హీరోయిన్ ఇలా అయిపోయిందేంటీ? ఇప్పుడు ఏం చేస్తుంది? భర్త ఎవరు?