Pawan Kalyan OG : మన టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఓజీ’. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పూర్తి అవ్వడానికి కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన 20 రోజుల కాల్ షీట్స్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. రాజకీయాల్లో ఫుల్ బిజీ గా మారిపోయిన పవన్ కళ్యాణ్ నుండి ఇప్పుడు డేట్స్ రాబట్టడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారిపోయింది. అభిమానులు ఆ కాస్త డేట్స్ ఏవో ఇచ్చేయొచ్చు కదా ఎందుకు ఆలస్యం చేయడం అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి బ్రతిమిలాడుతున్నారు. మరి ఆయన ఎప్పుడు కరుణిస్తాడో చూడాలి.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి గురించి సంగీత దర్శకుడు తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అభిమానులు ఆ వీడియో ని షేర్ చేస్తూ సినిమాపై మరింత హైప్ ని పెంచుకుంటున్నారు. ఓజీ చిత్రం ఎలా ఉండబోతుంది అని యాంకర్ తమన్ ని ప్రశ్న అడగ్గా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘ఓజీ చిత్రం కోసం నా మీసాలు కాస్త ఎక్కువ పెంచుతున్నాను, ఎందుకంటే మెలేయడానికి. అంత అద్భుతంగా ఆ చిత్రం వస్తుంది. పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా అయితే చూడాలని కోరుకుంటున్నారో, ఆ విధంగా ఈ సినిమా ఉంటుంది. మన టాలీవుడ్ నుండి ఒక సరైన గ్యాంగ్ స్టర్ మూవీ వచ్చి చాలా కాలం అయ్యింది. తమిళ ఇండస్ట్రీ చెప్పుకోడానికి జైలర్, లియో, విక్రమ్ వంటి చిత్రాలు ఉన్నాయి. మన టాలీవుడ్ నుండి ఓజీ ఆ లిస్ట్ లోకి చేరబోతుందని చాలా గర్వంగా చెప్పగలను’ అంటూ చెప్పుకొచ్చాడు తమన్.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల , నాకు ఆడియో ని మరింత కొత్తగా అప్డేట్ చేయడానికి సమయం పట్టింది. డైరెక్టర్ సుజిత్ కూడా నా వయస్సు గల వాడే కాబట్టి, మా ఇద్దరి మైండ్ సెట్స్ బాగా కలిసాయి. ఔట్పుట్ చాలా అద్భుతంగా వస్తుంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. తమన్ మాటలను బట్టీ చూస్తే ఈ సినిమా కచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది అనేది అర్థమవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుండి ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఒక్కటే రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యినట్టే, వచ్చే నెల 28న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. మార్చి 10 లోపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
#OG HITTING BIG pic.twitter.com/w107CiTgmv
— CineCorn.Com (@cinecorndotcom) February 8, 2025