Thaman Chiranjeevi family: సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడి సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోతే మాత్రం చాలా రకాల ఇబ్బందులైతే పడాల్సి ఉంటుంది. కొత్తవాళ్ళకి సపోర్ట్ ఉందని వాళ్ళకి ఇక్కడ అవకాశం రావడం కూడా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఇలాంటి ఇండస్ట్రీలో చిరంజీవి ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి ఏ సపోర్టు లేకుండా చాలా రకాల కష్టాలను అనుభవించి మొత్తానికైతే మెగాస్టార్ గా ఎదిగాడు… తన ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ప్రస్తుతం వాళ్ళందరు సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు… ఇక ఇప్పుడు ఒక విషయమైతే సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న తమన్ చిరంజీవికి దూరపు బంధువు అవుతాడు అంటూ కొన్ని కామెంట్లయితే చేస్తున్నారు… చిరంజీవి వాళ్ళ ముత్తాత, తమన్ వాళ్ళ ముత్తాత వరుసకి అన్నదమ్ములు అవుతారట… ఇక ఆ లెక్కన చిరంజీవి తమన్ కి అన్నవుతాడు. ఇక రీసెంట్ గా తమన్ ‘ఓజీ’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాడు…
అయితే ఇన్ని రోజుల వరకు వీళ్ళ మధ్య రిలేషన్ షిప్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లకు కూడా పెద్దగా ఐడియా లేదట. వీళ్ళంతా దూరపు బంధువులు కావడంతో వీళ్ళ మధ్య ఇంతకుముందు ఎప్పుడు పెద్దగా సన్నిహిత సంబంధలైతే లేవట. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే వీళ్ళ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందట.
అలాగే సినిమాల పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఫీల్డ్ లో రాణిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో తమన్ హవా నడుస్తోంది. ఆయన ఏ సినిమా చేసిన సూపర్ సక్సెస్ అవుతోంది. ఆయన మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. అటు సాంగ్స్, ఇటు బ్యాగ్రౌండ్ స్కోర్ రెండు హైలెట్ అవుతూ సినిమాని విజయ తీరాలకు చేర్చడంలో తమన్ కీలకపాత్ర వహిస్తున్నాడు…