Ritu Verma
Ritu Verma : గడిచిన నాలుగేళ్లలో ఎంతో మంది హీరోయిన్లు మన ఇండస్ట్రీ లోకి వచ్చారు. వారిలో కేవలం కొంతమంది మాత్రమే ఆడియన్స్ వద్ద మంచి పేరు సంపాదించుకున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రీతూ వర్మ(Ritu Varma). కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న రోల్స్ లో సందడి చేసిన ఈ అమ్మాయి, ‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిలిం ద్వారా బాగా పాపులర్ అయ్యింది. అలా ఆమె నిర్మాత సురేష్ బాబు దృష్టిలో పడగా, ఆయన తాను కొత్తవాళ్లతో నిర్మిస్తున్న ‘పెళ్లి చూపులు’ అనే సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత రీతూ వర్మ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా క్రేజీ మూవీస్ చేస్తూ మంచి రేంజ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటించిన ‘మజాకా'(Majaka Movie) చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘నేను కొంతమంది హీరోయిన్స్ లాగా ముద్దు సన్నివేశాల్లో నటించను అని చెప్పను. కచ్చితంగా నటిస్తా, ఇప్పటి వరకు నాకు ఆ అవకాశం రాలేదు. కథకు చాలా కీలకం అని డైరెక్టర్ చెప్తే రొమాన్స్ సన్నివేశాల్లో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చాలా మంది నేను అలాంటి సన్నివేశాల్లో నటించనేమో అని వాళ్లకు వాళ్ళే అనుకొని నా దగ్గరకు అలాంటి సీన్స్ చేయించడానికి రావట్లేదేమో’ అని చెప్పుకొచ్చింది రీతూ వర్మ. గత ఏడాది విడుదలైన స్వాగ్ మూవీ ఫలితం గురించి అడగగా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘ఈ సినిమాని మేము కేవలం ఒక సెక్షన్ ని టార్గెట్ ఆడియన్స్ గా పెట్టుకొని తీసాము’.
‘పెద్ద రేంజ్ కి వెళ్ళదు అని ముందుగానే మాకు తెలుసు. ప్రతీ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చాలనే రూల్ లేదు. నాకు అయితే ఆ సినిమా చేసినందుకు చాలా సంతృప్తి గా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి చూపులు 2 గురించి మాట్లాడుతూ ‘స్నేహితులందరం కలిసి సరదాగా తీసిన చిత్రమిది. అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. మా జీవితాలను మార్చేసింది ఈ చిత్రం. విజయ్ దేవరకొండ ఇంత పెద్ద స్టార్ అవుతాడని నేను అప్పట్లో అసలు ఊహించలేదు. అతని ఎనర్జీ ని చూసి కచ్చితంగా సక్సెస్ అవుతాడు అని మాత్రమే అనుకునేదాన్ని. తరుణ్ భాస్కర్ గారు ‘ఈ నగరానికి ఏమైంది 2’ కి స్క్రిప్ట్ రాస్తున్నాడు. కానీ ‘పెళ్లి చూపులు 2′ స్క్రిప్ట్ గురించి నాకు తెలియదు. ఒకవేళ అవకాశం వస్తే విజయ్ దేవరకొండ, నేను కలిసి మళ్ళీ నటిస్తాం’ అంటూ చెప్పుకొచ్చింది రీతూ వర్మ.