Thaman Prank Call to Sujeeth : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓజీ'(They Call Him OG). ఈ పేరు వింటేనే పవన్ అభిమానులు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ కి వెళ్లినా, రాజకీయ సభలకు వెళ్లినా, ఈ మారుమూల గ్రామం కి వెళ్లినా అభిమానులు ఆయన వెంట నడుస్తూ ‘ఓజీ..ఓజీ’ అని నినాదాలు చేస్తూ ఉంటారు. ఈ సినిమా మీద అభిమానుల్లో ఉన్న అంచనాలు, ఆశలు అలాంటివి మరి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్ల, కొంత కాలం షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. కానీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, కొన్ని నెలలు పాలన చేసి, మళ్ళీ ఆయన బ్యాలన్స్ ఉన్న ఓజీ షూటింగ్ తో పాటు, మిగిలిన రెండు సినిమాల షూటింగ్స్ ని కూడా పూర్తి చేసాడు. సినిమా ఫస్ట్ హాఫ్ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డబ్బింగ్ తో సహా పూర్తి అయ్యింది.
Our @MusicThaman prank call to Sujeeth#TheyCallHimOG @PawanKalyan pic.twitter.com/bOdUQWjEi6
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) August 1, 2025
ప్రస్తుతం సెకండ్ హాఫ్ ఎడిటింగ్ మీద పని చేస్తున్నారు. ఈ నెల 14 లోపు వర్క్ మొత్తం పూర్తి అవుతుందట. ఈ నెలాఖరు లోపు VFX వర్క్ కూడా అయిపోతుందని, సెప్టెంబర్ 10 లోపు మొదటి కాపీ ని సిద్ధం చేస్తారని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే మరోపక్క మూవీ టీం ప్రొమోషన్స్ ని రేపటి నుండి ప్రారంభించబోతుంది. సెప్టెంబర్ 25 న సినిమా విడుదల కాబోతుంది కాబట్టి, సరిగా 50 రోజుల సమయం ఉండడం తో ఈ చిత్రం నుండి పాటలు, యాక్షన్ టీజర్ కట్, మేకింగ్ వీడియో ఇలా సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని మొత్తం విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. రేపు ఈ చిత్రం లోని మొదటి పాట ‘ఫైర్ స్ట్రోమ్’ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం తేదీ వచ్చేసింది..!
ఇది కాసేపు పక్కన పెడితే ఇన్ స్టాగ్రామ్ లో ఓజీ టీం కేవలం ప్రొమోషన్స్ కోసం ‘ఇది పరిస్థితి’ అనే పేజీని క్రియేట్ చేశారు. ఈ పేజీ నుండి నేడు విడుదల చేసిన ఒక ప్రాంక్ వీడియో బాగా వైరల్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ డైరెక్టర్ సుజిత్ కి ప్రాంక్ కాల్ చేస్తూ ఆట పట్టించాడు. ముందుగా యాంకర్లు థమన్ ని సుజిత్ కి ప్రాంక్ కాల్ చెయ్యమని అడుగుతారు. అప్పుడు థమన్ ‘వాడు చాల ఫ్రాంక్..వాడికి ప్రాంక్ కాల్ నా?’ అని అంటాడు. ఇక ఆ తర్వాత సుజిత్ కి ఫోన్ చేసి ‘మన సాంగ్ ఎలా లీక్ అయ్యిందో సోషల్ మీడియా లో మొత్తం లీక్ అయిపోయింది. ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సుజిత్ రియాక్షన్ ఏమిటి అనేది ఈ క్రింది వీడియో లో చూసి తెలుసుకోండి.