OG Movie Advance Booking: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులను ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం బాగా నిరాశ పర్చింది అనేది వాస్తవం. ఇది పవన్ అభిమానులు కూడా ఒప్పుకుంటారు. కానీ ఓపెనింగ్స్ విషయం లో మాత్రం పవన్ కళ్యాణ్ మరోసారి తన పవర్ ని చూపించాడు. ఆరేళ్ళ నుండి సెట్స్ మీద ఉన్న సినిమా అంటూ ఎంతో ప్రచారం జరిగింది, విడుదల కాకముందే ఫ్లాప్ అనే వైబ్రేషన్స్ ని అభిమానుల్లో కూడా తీసుకొచ్చింది ఈ చిత్రం. అయినప్పటికీ బంపర్ ఓపెనింగ్ ని పెట్టాడు, ప్రీమియర్ షోస్ తో అయితే ఏకంగా పుష్ప 2 రికార్డుని కూడా బద్దలు కొట్టాడు పవర్ స్టార్. ప్రీమియర్స్ స్టామినా చూసిన తర్వాత ఓజీ(They Call Him OG) చిత్రానికి ప్రీమియర్ షోస్ ఏ రేంజ్ లో వెయ్యొచ్చు, ఎన్ని రికార్డ్స్ కొట్టొచ్చు అనే అంచనా కి వచ్చారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అందుకే ఇప్పటి నుండే అడ్వాన్స్ బుకింగ్స్ కి రెడీ అయిపోతున్నారు.
Also Read: రేపు ఓజీ, కూలీ చిత్రాల మధ్య పోటీ..గెలిచేది ఎవరు?
సెప్టెంబర్ 25 న ఈ చిత్రం విడుదల కాబోతుండడం తో, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 నుండే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారట డిస్ట్రిబ్యూటర్స్. ఓవర్సీస్ లో అత్యధిక ప్రీమియర్ షోస్ రికార్డ్స్ ఉన్న హీరో పవన్ కళ్యాణే. అలాంటి స్టామినా ఉన్న హీరో నుండి వచ్చిన ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి కనీసం 1 మిలియన్ డాలర్స్ కూడా రాలేదు. కారణం సరైన ప్లానింగ్ లేకపోవడం, చివరి నిమిషం వరకు నిర్మాతలు కంటెంట్ ని ఓవర్సీస్ కి పంపలేకపోవడం వల్ల అని అనుకోవచ్చు. అందుకే ఈసారి పక్కా ప్లానింగ్ తో పోతున్నారు. సెప్టెంబర్ 10 లోపు మొదటి కాపీ సిద్ధం అవుతుంది కాబట్టి, అప్పటి లోపు వెయ్యి షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ సెప్టెంబర్ 2 నే ప్రారంభించాలని అనుకుంటున్నారు.
Also Read: రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్ సమంత..సంచలనం రేపుతున్న ఫోటో!
త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఓవర్సీస్ ఆడియన్స్ లో ఓజీ చిత్రానికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. కేవలం బుకింగ్స్ ప్రారంభిస్తే చాలు, ఆల్ టైం రికార్డు ని చేతిలో పెడుతాము అన్నట్టుగా ఉన్నారు. కల్కి చిత్రానికి నార్త్ అమెరికా లో నాలుగు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ నుండి వచ్చాయి. ‘ఓజీ’ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి 5 మిలియన్ డాలర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానుంది. పవన్ అభిమానులు ఈ చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏ చిన్న రికార్డు ని కూడా వదలకుండా బద్దలు కొట్టాలని ఫిక్స్ అయిపోయారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఓజీ సునామీ ఎలా ఉండబోతుంది అనేది.