https://oktelugu.com/

Thaman Intersting Comments on Trivikram: “భీమ్లా నాయక్”కి నేను పిల్లర్‌ ఐతే, ఆయన సిమెంట్ – థమన్

Thaman Intersting Comments on Trivikram: పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద “భీమ్లా నాయక్” ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘భీమ్లానాయక్‌’ టీమ్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ మీట్ లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, దర్శకుడు సాగర్‌, సంగీత దర్శకుడు తమన్‌ తో పాటు పలువురు పాల్గొన్నారు. […]

Written By:
  • Shiva
  • , Updated On : February 26, 2022 / 05:19 PM IST
    Follow us on

    Thaman Intersting Comments on Trivikram: పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద “భీమ్లా నాయక్” ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘భీమ్లానాయక్‌’ టీమ్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ మీట్ లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, దర్శకుడు సాగర్‌, సంగీత దర్శకుడు తమన్‌ తో పాటు పలువురు పాల్గొన్నారు.

    Thaman Intersting Comments on Trivikram

    కాగా తమన మాట్లాడుతూ “మన అందరికీ తెలుసు ‘భీమ్లానాయక్‌’ పెద్ద తుపాన్‌ అని. సినిమా విడుదల చేయడానికి ముందు ఈ సినిమా గురించి ఎన్నో వదంతులు వచ్చాయి. సోషల్‌ మీడియాలో అయితే ఈ సినిమా పై నెగిటివ్ ప్రచారాన్ని ఎక్కువగా చేశారు. వాటన్నింటికీ సమాధానం చెప్పడానికి సుమారు ఏడు నెలల నుంచి ఎంతో కష్టపడ్డాను.

    Also Read:  మొద‌టి భార్య‌తో విడిపోయి రెండో పెండ్లికి రెడీ అవుతున్న హీరోలు వీరే

    ఈ సినిమా విషయంలో మా సంకల్పం చాలా గొప్పగా ఉంది. అందుకే ఈ సినిమాకి ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరకు పెద్ద కమర్షియల్‌ హిట్‌ అందుకుంది. ఏది ఏమైనా ‘భీమ్లానాయక్‌ ఒక ప్రయాణం. ఈ ప్రయాణం సాఫీగా సాగేలా త్రివిక్రమ్‌ ఎంతో స్వేచ్చ, సపోర్ట్‌ ఇవ్వడం మాకు బాగా కలిసి వచ్చింది. అందరూ నన్ను ఈ సినిమాకి పిల్లర్‌ అని మెచ్చుకుంటున్నారు.

    Telugu Film Director Trivikram Srinivas

    కానీ ఆ పిల్లర్‌ నిలబడటానికి సిమెంట్ కావాలి. ఆ సిమెంట్ త్రివిక్రమ్ గారే. అందుకు ఆయనకు నేను థ్యాంక్స్‌ చెబుతున్నాను. ఇక ‘భీమ్లానాయక్‌’ వైల్డ్‌ ఫైర్‌ లాంటిది. ఈ ఫైర్‌ని ఆపడం… చాలా కష్టం. త్రివిక్రమ్‌-పవన్‌ కాంబినేషన్‌ లో పనిచేయాలని నాకు ఎప్పటి నుంచో ఆశ పడుతున్నాను. ఆ కల ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు” అంటూ థమన్ చెప్పుకొచ్చాడు.

    మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని పవన్ నిరూపించారు. మొత్తమ్మీద సక్సెస్‌ఫుల్ టాక్‌తో పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లానాయక్’ మూవీ దూసుకెళ్తోంది.

    Also Read:  నా డబ్బు కాజేసి.. నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు – తనికెళ్ల భరణి

     

    Tags