Mahesh Trivikram Movie: థమన్ 20 ట్యూన్స్ ఇచ్చినా మహేష్ నాట్ హ్యాపీ… అసలు ఏం జరుగుతుంది?

త్రివిక్రమ్ - తమన్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమా మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్ అనేది అందరికీ తెలుసు. దీనితో ఈ సినిమాకు కూడా తమన్ ను తీసుకున్నారు త్రివిక్రమ్.

Written By: Shiva, Updated On : August 15, 2023 2:35 pm

Mahesh Trivikram Movie

Follow us on

Mahesh Trivikram Movie: టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మూవీ లిస్ట్ లో ఉన్న సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో వీళ్లిద్దరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా రాబోతుంది. కానీ ఈ సినిమాను ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ, ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది పరిస్థితి.

నిజానికి ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కానీ ఇప్పటికి కూడా అధికారికంగా ఒక్క షెడ్యూల్ పూర్తయిందని ప్రకటించే స్థితిలో లేదు చిత్ర యూనిట్. స్టోరీ దగ్గర నుండి హీరోయిన్స్, మరియు సాంకేతిక నిపుణుల దాకా అనేక మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. మొదటి లో KGF ఫైట్ మాస్టర్స్ తో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కించారు. కానీ అది అనుకున్న స్థాయిలో లేదని దాన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ స్టోరీ లో మార్పులు చేశారు.

మార్పులు చేసిన తర్వాత హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసేసి, సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీ లీలను మెయిన్ హీరోయిన్ గా తీసుకుని మీనాక్షి చౌదరి ని సెకండ్ లీడ్ కి తీసుకున్నారు. ఆ తర్వాత కెమెరామన్ పీఎస్ వినోద్ ని తప్పించి అతని స్థానంలో రవి కె చంద్రన్ ను తీసుకున్నారు. ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే మరోపక్క సినిమాకు ప్రధానమైన మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అనేక తర్జనభర్జనలు జరిగాయి.

త్రివిక్రమ్ – తమన్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమా మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్ అనేది అందరికీ తెలుసు. దీనితో ఈ సినిమాకు కూడా తమన్ ను తీసుకున్నారు త్రివిక్రమ్. కానీ మహేష్ బాబు మొదటి నుంచి తమన్ విషయంలో హ్యాపీ గా లేడు. అయితే దర్శకుడి ఛాయిస్ ను కాదనలేకపోయాడు. కానీ తమన్ మాత్రం ట్యూన్స్ విషయంలో హీరోను మెప్పించలేకపోయాడని తెలుస్తుంది.

ఇప్పటికే దాదాపు 20 ట్యూన్స్ ఇచ్చినా కానీ అటు హీరో కావచ్చు, ఇటు దర్శకుడు కావచ్చు ఒక్కటి కూడా ఫైనల్ చేయలేదని సమాచారం. దీనితో తమన్ ఎలాగోలా కష్టపడితే చివరికి ఒక్క ట్యూన్ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. దీనిని ఈ నెల చివరికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ అనుకున్న స్థాయిలో హిట్ అయితే తమన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. అది ఏమైనా తేడా కొడితే మాత్రం తమన్ ప్లేస్ లో మరొకరు వచ్చిన రావచ్చు.