https://oktelugu.com/

Rana Daggubati: స్టార్ హీరోయిన్ కి బహిరంగ క్షమాపణలు చెప్పిన రానా దగ్గుబాటి!

గతంలో దుల్కర్ సల్మాన్ ఓ హిందీ ప్రాజెక్ట్ చేశారు. ఆ చిత్ర నిర్మాతలు నాకు మిత్రులు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంటే నేను సెట్స్ కి వెళ్ళాను. షాట్ రెడీ చేసి దుల్కర్ తో పాటు యూనిట్ మొత్తం హీరోయిన్ కోసం ఎదురుచూస్తుంది.

Written By:
  • Shiva
  • , Updated On : August 15, 2023 / 02:41 PM IST

    Rana Daggubati

    Follow us on

    Rana Daggubati: హీరో రానా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరారు. ఆయన చేసిన కామెంట్స్ ఓ హీరోయిన్ పై నెగిటివిటీకి కారణమయ్యాయి. దీంతో తన వ్యాఖ్యలు తప్పుగా ప్రొజెక్ట్ అయ్యాయని రానా క్షమాపణలు చెప్పారు. రానా క్షమాపణలు చెప్పిన హీరోయిన్ సోనమ్ కపూర్. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం… దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన కింగ్ ఆఫ్ కొత్త ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రానా గెస్ట్ గా హాజరయ్యారు. దుల్కర్ ఎంత సహనం కలిగిన హీరోనో చెప్పేందుకు ఆయన ఓ సంఘటన వివరించారు.

    ‘గతంలో దుల్కర్ సల్మాన్ ఓ హిందీ ప్రాజెక్ట్ చేశారు. ఆ చిత్ర నిర్మాతలు నాకు మిత్రులు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంటే నేను సెట్స్ కి వెళ్ళాను. షాట్ రెడీ చేసి దుల్కర్ తో పాటు యూనిట్ మొత్తం హీరోయిన్ కోసం ఎదురుచూస్తుంది. పేరు చెప్పను కానీ ఆ హీరోయిన్ భర్తతో ఫోన్ లో షాపింగ్ గురించి మాట్లాడుతుంది. ఎండలో దుల్కర్ అలానే సహనంగా ఎదురుచూస్తున్నాను. టేక్స్ తీసుకుంటుంది. డైలాగ్స్ చెప్పడం లేదు. మరలా ఫోన్ మాట్లాడుతూ దుల్కర్ ని వెయిట్ చేయిస్తుంది.

    కాసేపటికి కోపంతో నేను చేతిలో ఉన్న బాటిల్ నేలకేసి కొట్టాను. తర్వాత ఆ హీరోయిన్ భారీ కాన్వాయ్ తో అక్కడ నుండి వెళ్ళిపోయింది. దుల్కర్ మాత్రం తన ఇన్నోవాలో సింపుల్ గా వెళ్లిపోయారు. అంతటి సహనం కలిగిన హీరో దుల్కర్ అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ రానా చెప్పిన హీరోయిన్ సోనమ్ కపూర్ కావడంతో ఆమెను నెటిజెన్స్ ట్రోల్ చేశారు. దీంతో రానా ఆమెకు క్షమాపణలు చెప్పారు.

    నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారు. సోనమ్ కపూర్ నా ఫ్రెండ్. మా మధ్య సరదా సంభాషణలు జరుగుతూనే ఉంటాయి. అయితే జనాలు నా కామెంట్స్ కారణంగా ఆమెను దూషిస్తున్నారు. అందుకు సోనమ్, దుల్కర్ లకు నా క్షమాపణలు. ఇకనైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారని నేను భావిస్తున్నాను, ఆయన ట్వీట్ చేశారు. రానా ఓ హీరోయిన్ కి నేరుగా క్షమాపణలు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. దుల్కర్ సల్మాన్, సోనమ్ జంటగా జోయా ఫ్యాక్టర్ టైటిల్ తో మూవీ చేశారు.