Thaman
Thaman : రామ్ చరణ్(Global Star Ram Charan) అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని పీడకల లాంటి చిత్రం ‘గేమ్ చేంజర్'(Game Changer Movie). #RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అంటే ప్రతీ ఒక్కరికి ఈ చిత్రం పై అటెన్షన్ ఉంటుంది. సినిమా హిట్ అయితే ప్రశంసల వర్షం కురిపిస్తారు, ఫ్లాప్ అయితే కనీవినీ ఎరుగని రేంజ్ ట్రోల్స్ వేస్తారు. ముఖ్యంగా నందమూరి, మెగా అభిమానుల మధ్య ఇలాంటి ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియా లో దశాబ్దాల కాలం నుండి నడుస్తూనే ఉంది. #RRR తర్వాత ఎన్టీఆర్(Junior NTR) నటించిన ‘దేవర’ హిట్ అయ్యింది, రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ అయ్యింది. ఇక ట్రోల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాం. ట్విట్టర్ ని ఉపయోగించే వాళ్లకు దీనిపై ఒక క్లారిటీ ఉంది. కేవలం ఈ సినిమా పైనే కాదు, ఈ సినిమాలోని పాటలకు కూడా ట్రోల్స్ పెద్ద ఎత్తున జరిగాయి.
ఈ చిత్రంలోని ‘జరగండి..జరగండి’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా లోనే కాదు, బయట కూడా ఈ పాట మారుమోగిపోయింది. ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా ది లెజెండ్ ప్రభుదేవా మాస్టర్ పని చేశాడు. ఈ పాట కోసం ఆయన ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదట. కేవలం శంకర్, రామ్ చరణ్ మీద ఉన్న అభిమానం తోనే చేశాడట. అందుకేనేమో అంతటి చెత్త స్టెప్పులను కంపోజ్ చేసారంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేసారు. అయితే రీసెంట్ గానే ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన తమన్(SS Thaman) ‘జరగండి’ పాటపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఓంకార్ నేతృత్వం లో ‘డ్యాన్స్ ఐకాన్ 2’ షో ఆహా మీడియా లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ కార్యక్రమానికి తమన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.
ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ అందరూ తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ కి డ్యాన్స్ వేశారు. వాటిలో ‘గేమ్ చేంజర్’ నుండి ‘జరగండి..జరగండి’ పాటకు ఒక చిన్న అమ్మాయి డ్యాన్స్ వేసింది. ఆ అమ్మాయి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ని చూసిన తమన్, అద్భుతంగా డ్యాన్స్ వేశావు, ఒరిజినల్ పాటలోని స్టెప్పులకంటే ఇందులోనే బాగున్నాయి, ఇలాంటి స్టెప్పులు ఒరిజినల్ సాంగ్ లో కంపోజ్ చేసి ఉండుంటే అదిరిపోయేది అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా విడుదలకు ముందు తమన్ ఈ చిత్రంలో జరగండి పాట అద్భుతంగా ఉంటుంది, అభిమానులు సీట్స్ లో కూర్చోలేరు అంటూ వేరే లెవెల్ ఎలివేషన్స్ వేసేవాడు. కానీ విడుదల తర్వాత ఇలా మాట్లాడుతున్నాడు. ఇది ప్రభుదేవా మాస్టర్ ని మాత్రమే కాదు, రామ్ చరణ్ ని కూడా అవమానించినట్టు అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ని చూసి మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి.