Homeఎంటర్టైన్మెంట్Thalapathy Vijay Accident: తమిళ హీరో విజయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం.. కళ్ళు పొయ్యేంత...

Thalapathy Vijay Accident: తమిళ హీరో విజయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం.. కళ్ళు పొయ్యేంత పని అయిందిగా..

Thalapathy Vijay Accident: మరో వారం రోజుల్లో తమిళనాడు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా, రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం లో ఫుల్ బిజీ గా ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారం లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక పార్టీ TVK. తమిళ సూపర్ స్టార్ విజయ్(Thalapathy Vijay) నేతృత్వం లో స్థాపించిన ఈ పార్టీ మొట్టమొదటిసారి ఎన్నికల్లో పాల్గొనబోతుంది. దీంతో విజయ్ ఎన్నికల ప్రచారాలకు జనాలు పోటెత్తుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. జనాలకు దగ్గరయ్యే కార్యక్రమాలతో , ఆసక్తికరమైన ఉపన్యాసాలతో ప్రధాన పార్టీలకు విజయ్ వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తున్నాడు. ఈ క్రమం లో నేడు ఆయన రైతులతో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో , పెను ప్రమాదం జరగబోయింది. ఆయన కంటికి తీవ్రమైన గాయాలు అయ్యేవి , తృటిలో తప్పించుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే పార్టీ మ్యానిఫెస్టో ని రైతులకు విజయ్ వివరిస్తున్న సమయం లో , ఒక రైతు ని వేదిక పైకి పిలుస్తాడు. ఈ సందర్భంగా వరి పేరుతో పాటు, వేల్ జాతికి చెందిన చేపని కూడా తీసుకొస్తాడు ఆ రైతు. దానిని పైకి ఎత్తుకునే సమయం లో , విజయ్ కంటికి తగిలేంత పని అయ్యింది. కానీ విజయ్ వెంటనే అలెర్ట్ అవ్వడం తో ఈ ప్రమాదం నుండి తప్పించుకోగలిగాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇక TVK పార్టీ విషయానికి వస్తే, తమిళనాడు లో అన్ని రాజకీయ పార్టీలు పొత్తు ద్వారా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే, ఒక్క విజయ్ TVK మాత్రమే ఒంటరిగా 234 స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఈ నెల 23 న ఎన్నికలు జరగబోతుండగా , మే 4 న ఎన్నికల ఫలితాలు బయటకు రానున్నాయి.

విజయ్ ని తమతో కలుపుకొని పోటీ చేయడానికి NDA కూటమి విశ్వప్రయత్నాలు చేసింది. నిజానికి విజయ్ అలా పోటీ చేస్తే , కచ్చితంగా NDA తో కలిసి అధికారాన్ని ఏర్పాటు చేయొచ్చు , మన పవన్ కళ్యాణ్ లాగా ప్రభుత్వం లో భాగస్వామి అయ్యి, ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవచ్చు. కానీ విజయ్ అందుకు ఒప్పుకోలేదు. చర్చలు అయితే చాలా రోజులు జరిగాయి , NDA కూటమి 80 సీట్లు , డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేశారు, కానీ విజయ్ మాత్రం వంద సీట్లు, రెండున్నర ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి పదవి ని డిమాండ్ చేశారు. అందుకు NDA ఒప్పుకోకపోవడం తో , ఇప్పుడు విజయ్ ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. మరి ఈ ఒంటరి పోరులో ఆయన ఏ మాత్రం ప్రభావం చూపిస్తాడో చూడాలి. అభిమానులు విజయ్ కచ్చితంగా గేమ్ చేంజర్ స్థానంలో నిలుస్తాడని బలంగా నమ్ముతున్నారు. మరి అంత సీన్ ఉందో లేదో తెలియాలంటే మే 4 వరకు ఆగాల్సిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular