Thalapathy Vijay : తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) రీసెంట్ గానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న గాక మొన్న రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది కానీ, అప్పుడే ఏడాది కాలం పూర్తి అయ్యింది. వచ్చే ఏడాది విజయ్ తన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. అందుకోసం ఆయన ప్రశాంత్ కిషోర్ ని రాజకీయ సలహాదారుడిగా పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే విజయ్ ఒక ప్రణాళిక బద్దంగా జనాల్లోకి వెళ్తున్నాడు. త్రి బాషా విధానం ని వ్యతిరేకించడం తో పాటు, ‘waqf’ బిల్ కి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ సుప్రీమ్ కోర్టులో పిటీషన్ వేయడం, అదే విధంగా తమిళనాడు లో జరిగే ప్రతీ సంఘటనలో చురుగ్గా స్పందిస్తూ తన గొంతు ని వినిపించడం వంటివి చేస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన కోయంబత్తూర్ లో ఒక సభ ని నిర్వహించాడు. సభలో పాల్గొనే ముందు ఆయన నిర్వహించిన ర్యాలీలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
Also Read : రెట్రో’ ని డబుల్ మార్జిన్ తో డామినేట్ చేస్తున్న ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్!
వ్యక్తిగత సిబ్బంది పెద్దగా లేకపోవడం తో అదుపు తప్పిన అభిమానులు విజయ్ ప్రయాణిస్తున్న వ్యాన్ పై దూకేస్తున్నారు. ఒక అభిమాని అయితే చెట్టు మీద కూర్చొని, విజయ్ వస్తున్న వ్యాన్ ని గమనించి, కోతిలాగా ఆ వ్యాన్ మీదకు దూకేసాడు. ఒక్కసారిగా అభిమాని ఆకాశం నుండి ఊడిపడినట్టుగా అలా దూకడంతో విజయ్ షాక్ కి గురి అయ్యాడు. అనంతరం ఆ అభిమాని ని దగ్గరకు పిలిచి మేడలో పార్టీ కండువా వేసి పంపించేశాడు. ఇలాంటి ఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో జరుగుతూ వచ్చాయి. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి. దీనిపై విజయ్ ఫ్యాన్స్ దయచేసి సెక్యూరిటీ ని పెట్టుకో అన్నా, నీ దగ్గరకు వచ్చే ప్రతీ ఒక్కడు అభిమాని కాకపోయుండొచ్చు, శత్రువులకు నిన్ను సులువుగా కలిసే ఛాన్స్ ఇస్తే అత్యంత ప్రమాదం అంటూ విజయ్ ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఒకపక్క విజయ్ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే, మరోపక్క ‘జన నాయగన్’ సినిమా షూటింగ్ లో బిజీ గా గడుపుతున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లో జరగనున్నాయి. ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు ఈ సినిమా విడుదల కాబోతుంది అన్నమాట. సక్సెస్ అయితే విజయ్ పార్టీ కి మంచి బూస్ట్ దొరికినట్టే, ఫ్లాప్ అయినా కూడా ఏ ఎఫెక్ట్ ఉండదు అనుకోండి, అది వేరే విషయం. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా, ప్రేమలు హీరోయిన్ మమిత బైజు కీలక పాత్ర పోషిస్తున్నాడు. తెలుగు లో సూపర్ హిట్ అయిన ‘భగవంత్ కేసరి’ కి ఈ చిత్రం రీమేక్ అని అందరూ అంటున్నారు కానీ, క్లారిటీ రావాల్సి ఉంది.
Fan jumps like ️ from a tree to catch Joseph Vijay during TVK road show. pic.twitter.com/O1cGkwHPbV
— Manobala Vijayabalan (@ManobalaV) April 26, 2025