Thalapathy vijay Birthday Special: ప్రస్తుతం సౌత్ ఇండియా లో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్న హీరో దళపతి విజయ్..వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫాన్స్ ని ఖుషి చేస్తున్న విజయ్ ఇటీవల కాలం లో ఆయన నుండి వచ్చిన బీస్ట్ సినిమా ఫ్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ కూడా వసూళ్ల పరంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా ప్రభంజనం సృష్టించేసింది..ఫ్లాప్ టాక్ తో ఈ స్థాయి వసూళ్లను కొల్లగొట్టిన హీరో ఒక్క సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రమే..ఆయన హీరో గా నటించిన కబాలి చిత్రం కనివిని ఎరుగని స్థాయి అంచనాలతో విడుదలైంది..కానీ ఆ అంచనాలు అందుకోవడం లో ఈ సినిమా విఫలం అయ్యింది..కానీ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ప్రభంజనమే సృష్టించింది..సుమారు 290 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కొల్లగొట్టి అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసింది ఈ చిత్రం..ఆ సినిమా తర్వాత ఫ్లాప్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టిన తమిళ సినిమా బీస్ట్ మాత్రమేనట..కబాలి సినిమా తర్వాత నుండి విజయ్ తో పోలిస్తే రజిని కాంత్ మార్కెట్ చిన్నగా తగ్గుతూ వచ్చింది..ముఖ్యం గా సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఓవర్సీస్ మార్కెట్ సౌత్ ఇండియా లో ఏ హీరోకి కూడా లేదు..అమెరికా , ఆస్ట్రేలియా, లండన్ , మలేసియా, శ్రీలంక, యూరోప్ , సింగపూర్ మరియు దుబాయ్ వంటి ప్రాంతాలలో రజినీకాంత్ మార్కెట్ లెవెల్ వేరు..కానీ వరుసగా ఫ్లాప్ సినిమాలు రావడం తో..వయస్సు కూడా 70 ఉండడం తో రజినీకాంత్ ఓవర్సీస్ మార్కెట్ కూడా తగ్గిపోయింది.
కానీ విజయ్ ఓవర్సీస్ మార్కెట్ మాత్రం అమాంతం పెరిగిపోయింది అనే చెప్పాలి..సినిమా సినిమాకి కొత్తదనం చూపుతూ సూపర్ హిట్స్ అందుకుంటూ విజయ్ తన మార్కెట్ ని ఒక్క రేంజ్ లో విస్తరింపచేసుకున్నాడు..ఇక తమిళనాడు లో కూడా విజయ్ ఊపు ప్రస్తుతం ఏ హీరో కి లేదు అని చెప్పొచ్చు..ఇటీవల కాలం లో గొప్ప సినిమాలు ఏమి పడకపోయినప్పటికీ 200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అతి తేలికగా కొల్లగొట్టేస్తుంది..ఇది విజయ్ ప్రస్తుత బాక్స్ ఆఫీస్ స్టామినా కి నిదర్శనం గా చెప్పుకోవచ్చు..ఒక్కప్పుడు విజయ్ అనే హీరో కేవలం ఒక్క రీమేక్ స్టార్ మాత్రమే..లుక్స్ దగ్గర నుండి యాక్టింగ్ వరుకు విజయ్ ని ఒక్క రేంజ్ లో ట్రోల్ చేసేవారు మన తెలుగు ఆడియన్స్..కానీ ఇప్పుడు ఆ హీరోనే తెలుగులో కూడా 20 కోట్ల రూపాయిల రేంజ్ మార్కెట్ ని అందుకున్నాడు..ప్రస్తుతం విజయ్ తెలుగు లో ఒక్క డైరెక్ట్ సినిమా చేస్తున్నాడు..ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా..వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు..ఇది ఇలా ఉండగా విజయ్ అతి త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు అని కోలీవుడ్ మొత్తం గత కొంతకాలం నుండి గట్టిగా వినిపిస్తున్న వార్త..సౌత్ లో ఇప్పటి వరుకు వచ్చిన హీరోలలో ఒక్క ఎన్టీఆర్ మరియు MGR తప్ప ఎవ్వరు కూడా రాజకీయాల్లో రాణించలేకపొయ్యారు..అలాంటిది విజయ్ ఎంత వరుకు రాణిస్తాడో చూడాలి..ఈరోజు ఆయన పుట్టినరోజు అవ్వడం తో తమిళనాడు లో ఎక్కడ చూసిన ఒక పండగ వాతావరణం లాగ కనిపిస్తుంది..చెన్నై నగర వీధుల్లో ప్రతి వీధికి విజయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ అభిమానులు వేసిన బ్యానర్లు దర్శనమిస్తున్నాయి..బ్లడ్ డొనేషన్స్ , కేక్ కట్టింగ్స్ మరియు అన్నదానాలు చేస్తూ అభిమానులు తమ హీరో పై ఎనలేని ప్రేమని చూపిస్తున్నారు.
Also Read: South India sentiment- BJP: మళ్లీ సౌత్ ఇండియా సెంటిమెంట్.. బీజేపీకి గండమే