Pushpa: పెద్ద సినిమాల బడ్జెట్ విషయంలో లెక్కలు ఎప్పుడు కరెక్ట్ గా ఉండవు. ఎలాగూ స్టార్ హీరోతో సినిమాను పూర్తి చేయాలంటే వందల కోట్లు ఖర్చు ఉంటుంది, ఆ ఖర్చును సమర్ధవంతంగా పెట్టే ఆనవాయితీ మన దర్శకుల్లో తక్కువ. ఇక సుకుమార్ లాంటి దర్శకుడు అయితే, ఆ విషయంలో ఎప్పుడూ వెనుకే. సహజంగానే సుకుమార్ సినిమాలంటే బడ్జెట్ పరిమితులు దాటిపోతాయి. పెర్ఫెక్షన్ కోసం సుక్కు బడ్జెట్ ను అడ్డగోలుగా పెంచుకుంటూ పోతాడు.

ఇప్పుడు పుష్ప విషయంలో కూడా బడ్జెట్ పెరిగింది. దాదాపు ముప్పై నుంచి నలభై కోట్లు బడ్జెట్ పెరిగింది. కేవలం పాటల కోసమే సుకుమార్ 16 కోట్లను ఖర్చు పెట్టించాడు. పాన్ ఇండియా సినిమా అంటూ లేనిపోని గొప్పలకు పోయి సుక్కు మొత్తానికి నిర్మాతల జేబుకు చిల్లు పెట్టించాడు. కానీ సినిమా రిలీజ్ కి దగ్గర పడే సమయానికి గానీ, అసలు విషయం అర్ధం కాలేదు.
ఒకపక్క బడ్జెట్ పెరిగింది. మరోపక్క అవుట్ ఫుట్ పై ‘సుక్కు’ కు నమ్మకం రావడం లేదు. ఒక దర్శకుడిగా సుకుమార్ పక్కా పెర్ఫెక్షనిస్ట్. సినిమా బాగా రావాలని చివరి వరకు ప్రయత్నిస్తాడు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడడు. అందుకే మొదటి నుంచి పుష్ప బడ్జెట్ విషయంలో అసలు తగ్గేదే లే అంటూ ముందుకుపోయాడు.
కానీ, సినిమాకి పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. కానీ సుక్కు మాత్రం సినిమాలో కొన్ని సీజీ షాట్స్ కోసం ముంబైలో కసరత్తులు చేస్తున్నాడు. రిలీజ్ కి నాలుగు రోజుల ముందు వరకు ఇంకా ఫస్ట్ కాపీని సుక్కు రెడీ చేయకపోవడమే ఇప్పుడు బయ్యర్లను బాగా టెన్షన్ పెడుతుంది.
Also Read: Victory Venkatesh: విక్టరీ వెంకటేష్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్… అదరగొట్టిన వెంకీ
ఒకవేళ సినిమాకి అనుకున్నట్లు గొప్ప పేరు అండ్ హిట్ టాక్ రాకపోతే.. ఇక ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం కష్టం. పైగా బన్నీకి వందల మార్కెట్ ఏమి లేదు. ఒక విధంగా అల్లు అర్జున్ కెరీర్ లో భారీ బడ్జెట్ పెట్టింది పుష్పకే. అందుకే, నిర్మాతలు కూడా బాగా టెన్షన్ పడుతున్నారు. బడ్జెట్ విషయంలో సుకుమార్ కి నిర్మాతలకు అభిప్రాయబేధాలు కూడా వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మొత్తమ్మీద పుష్ప విషయంలో అందరికీ టెన్షనే.
Also Read: Samantha: అరిగిపోయిన క్యాసెట్ ను ఎన్నాళ్ళు వేస్తావ్ సమంత ?