Telusu Kada trailer review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ బాయ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు సిద్దు జొన్నల గడ్డ… డీజే టిల్లు సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించి ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆయన నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ఎలా ఉంది అంటే… ఇద్దరమ్మాయిల మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్ లో సిద్దు జొన్నలగడ్డ నటించాడు. ఇక ట్రైలర్ మొత్తం ఎంటర్టైన్మెంట్ తో అలాగే ఎమోషన్స్ తో కూడిన ఒక సిచువేషన్ లో సిద్దును చూపించారు అలాగే తను చెప్పిన డైలాగులు సైతం ట్రైలర్ మొత్తానికి హైలైట్ అయ్యాయి…
ఇటు శ్రీనిధి శెట్టి, అటు రాశి కన్నా ఇద్దరితో డేటింగ్ లో ఉన్న తను చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది ఈ సినిమా కోర్ పాయింట్ గా తెలుస్తోంది. ఇక ట్రైలర్ స్టార్టింగ్ లోనే సిద్దు విపరీతమైన కోపంతో తన ఫ్రెండ్ కి ‘మగాడు అనేవాడు తన పెళ్ళాం దగ్గర ఎప్పుడైతే తన కష్టాలను చెప్పుకుంటాడో అప్పుడే వాడికి తెలియకుండానే తన జీవితాన్ని వాడి భార్య దగ్గర పెడతాడు’ అంటూ చెప్పిన డైలాగు చాలా మంచి ఇంపాక్ట్ ను ఇచ్చింది.
అలాగే మాట్లాడానికి గల కారణం ఏంటి? మొత్తానికి ఈ సినిమాలో విలన్ ఎవరు? ఇద్దరు హీరోయిన్లలో ఎవరో ఒకరు విలన్ గా మారతారా? లేదంటే హీరోనే విలన్ అవుతున్నాడా? అనేది ట్రైలర్ లో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు…ప్రతి సీన్ లో సిద్దు తన డామినేషన్ చూపిస్తున్నాడు. ఇక ఇంతకుముందు వచ్చిన ‘జాక్’ సినిమాతో ఆశించిన విజయం సాధించలేకపోయాడు.
ఆయన ఈ సినిమాతో మాత్రం సూపర్ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ ట్రైలర్ ద్వారా సినిమాలో ఎలాంటి కన్ క్లూజన్ ఇవ్వబోతున్నారు అనేది క్లారిటీ ఇవ్వలేకపోయారు…అలాగే కొన్ని ట్విస్టులు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి…ఇక ఈ సినిమాలో తమన్ మ్యూజిక్ కూడా బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ఫ్రెష్ గా ఉంది…సిద్దు ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ టిపికల్ క్యారెక్టర్ చేస్తున్నాడు… దీనివల్ల ఆయనకి కొత్త ఇమేజ్ వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…