Telusu Kada Movie Twitter Talk: ‘జాక్’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) చేసిన చిత్రం ‘తెలుసు కదా'(Telusu Kada Movie). గతం లో నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన నీరజ కోన ఈ చిత్రం ద్వారా తొలిసారి డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. థమన్ అందించిన రెండు పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. యూత్ ఆడియన్స్ ఈ రెండు పాటలకు బాగా కనెక్ట్ అయ్యారు. కానీ థియేట్రికల్ ట్రైలర్ మాత్రం ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు. కొన్ని డైలాగ్స్ ప్రస్తుత జనరేషన్ లో నడిచే అంశాలను గుర్తు చేసే విధంగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ, హీరో చేత సినిమా మొత్తం ప్రవచనాలే చెప్పించారా అనే అనుమానం రాక తప్పదు. అందుకే ట్రైలర్ ఈ సినిమాపై కావాల్సిన బజ్ ని క్రియేట్ చేయలేకపోయింది అనడం లో ఎలాంటి సందేహం.
was liking where the story was going, the black white and grey of each character.. but ruined it all for me with that ending. not convinced. #TelusuKada
— ryuk (@nirvahna_) October 17, 2025
అయితే నేడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో విడుదలైంది. మరి ట్రైలర్ ని చూసి ఈ సినిమాని తక్కువ అంచనా వేసిన ప్రేక్షకులు సర్ప్రైజ్ ఫీల్ అయ్యారా?, లేదా సినిమా కూడా అనుకున్నట్టుగానే ఉందా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ పూర్తి అవ్వడంతో ట్విట్టర్ లో టాక్ వచ్చేసింది. ట్విట్టర్ టాక్ ప్రకారం చూస్తే కాస్త డివైడ్ రెస్పాన్స్ వచ్చింది అనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు సిద్దు జొన్నలగడ్డ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ , యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ కారణంగా ఎంగేజింగ్ గా అనిపించిందని అంటున్నారు. కానీ డైరెక్టర్ నీరజ కోన ఎంచుకున్న స్టోరీ ని, సరైన స్క్రీన్ ప్లే తో నడిపించడం తో ఫెయిల్ అయ్యిందని అంటున్నారు. స్టోరీ సెటప్ కారణంగా నిజమైన ఎమోషన్స్ పండలేదని అంటున్నారు. ఒక రిలేషన్ షిప్ స్టేటస్ ని కొత్త పద్దతిలో చూపించే ప్రయత్నం చేశారు కానీ, ఇలాంటి సినిమాలకు ఆడియన్స్ బుర్రకి పని చెప్పకుండా ఎంటర్టైన్మెంట్ అందించాలి.
@NeerajaKona Take a bow mam. As a debutant director you have proven what you r. I am in love with the way you have sketched every frame and the way you handled the story and characters. you stood top notch on production values with less characters nd best performances #telusukada
— OG (@ray_challa) October 17, 2025
ఆ విషయం లో డైరెక్టర్ విఫలం అయ్యినట్టు తెలుస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమా ని చూసే వాళ్లకు పర్వాలేదు, ఒక కొత్త ప్రయోగం చేసారని అనిపిస్తాది కానీ, భారీ అంచనాలు పెట్టుకొని వెళ్తే మాత్రం నిరాశ చెందక తప్పదని అంటున్నారు. హీరోయిన్స్ గా నటించిన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి చక్కగా నటించారని, ముఖ్యంగా ‘మల్లికా గంధ’ పాట ఆన్ స్క్రీన్ పై అదిరిపోయిందని అంటున్నారు. అర్బన్ యూత్ ఆడియన్స్ కి ఈ చిత్రం నచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ, మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం అసలు నచ్చదని, మాస్ ప్రాంతాల్లో కూడా ఈ చిత్రం వాష్ అవుట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మేరకు రాణిస్తుంది అనేది.
#TelusuKada,#dude,#KRamp ..Y dragging this fellows now e days viewers no patience they feel bore ..past 10 years back viewers parciption defrent now defrent..film directors ,editors be focous movie with engaging ,you tell anything but do it with engaging …. 2ndhalf is main
— (@khadar666) October 17, 2025