Dude Movie Twitter Talk: ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan), మమిత బైజు(Mamitha Baiju) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘డ్యూడ్'(Dude Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రదీప్ నుండి వస్తున్న సినిమా కావడంతో పాటు, ట్రైలర్ కూడా ఆడియన్స్ విశేషంగా ఆకట్టుకోవడం తో ఈ సినిమా పై అంచనాలు యూత్ ఆడియన్స్ లో అమాంతం పెరిగిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా డొమెస్టిక్ మరియు ఓవర్సీస్ మార్కెట్స్ లో వేరే లెవెల్ లో జరిగాయి. నిన్న రాత్రి బుక్ మై షో యాప్ లో గంటకు 10 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. 24 గంటలకు కలిపి కేవలం బుక్ మై షో యాప్ నుండి లక్షా 40 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. దీనిని బట్టీ ప్రదీప్ రంగనాథన్ కేవలం రెండు సినిమాలతో యూత్ ఆడియన్స్ లో ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.
#Dude A Mid Rom-Com with a Fairly Engaging First Half but a Lackluster Second Half!
The film hits all the familiar beats of a typical rom-com. The first half starts off a bit slow but picks up well toward the pre-interval, ending with a well-executed interval block. However, the…
— Venky Reviews (@venkyreviews) October 17, 2025
విడుదలకు ముందే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే ఫీలింగ్ ని రప్పించిన ఈ చిత్రం, నేడు థియేటర్స్ లో ఆడియన్స్ నుండి కూడా అలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుందో లేదో చూద్దాం. ఏ సినిమాకు అయినా సరైన టాక్ తెలుసుకోవాలంటే ట్విట్టర్ కి వెళ్ళాలి. అక్కడ ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళ నుండి టాక్ తెల్లవారు జామునే వచ్చేస్తుంది. అలా ఈ సినిమాకు కూడా టాక్ వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉందని, మొదటి సన్నివేశం నుండి మంచి ఎంటర్టైన్మెంట్ మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ కీర్తి స్వరణ్ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని అంటున్నారు. ప్రదీప్ రంగనాథన్ మరియు మమిత బైజు మధ్య కెమిస్ట్రీ చాలా చక్కగా వర్కౌట్ అయ్యిందని, వీళ్లిద్దరి మధ్య వచ్చే కొన్ని క్యూట్ మూమెంట్స్, మరి ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు.
Decent second half with a complicated relationship. There’s humor throughout the film. Pradeep and Mamitha nailed it. BGM and music feels fresh throughout the film. The debut director picked a good story and weaved it with an engaging screenplay.
The emotions in the last 20 mins… pic.twitter.com/YQIoVvtQSc
— Sharat Chandra (@Sharatsays2) October 17, 2025
ఇక సాయి అభయంకర్ అందించిన సంగీతం ఈ సినిమాకు గొప్ప వేల్యూ ని జత చేసిందని, ఈ రేంజ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఒక మీడియం రేంజ్ హీరో నుండి రావడం ఇప్పటి వరకు జరగలేదని చెప్పుకొచ్చారు. ఇక సెకండ్ విషయానికి వస్తే, ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కాస్త తగ్గిందని, కథ ఒక ట్రాక్ నుండి మరో ట్రాక్ కి షిఫ్ట్ అయ్యిందని, కాస్త అల్లు అర్జున్ ఆర్య 2 మూవీ షేడ్స్ కనిపించినప్పటికీ, డైరెక్టర్ కీర్తి తన అద్భుతమైన టేకింగ్ తో ఎంగేజింగ్ గా తీయడం లో సక్సెస్ అయ్యాడని, చివరి 30 నిమిషాలు సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్ళిందని, యూత్ ఆడియన్స్ కి ఒక చక్కటి మెసేజ్ కూడా ఈ చిత్రం అందించిందని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా కూడా ప్రదీప్ మొదటి రెండు చిత్రాలు లాగానే భారీ హిట్ అవుతుందా లేదా అనేది.
#Dude – PR’s Style, his combo with Mamitha Nice. Sarathkumar shines in versatile role. Hridhu Gud addition. Music ok. Slow start, Interval block 20Mins ROFL. Final act could have been better. Though less emotional connect, Humour drives d narration to an extent. ONE TIME WATCH!
— Christopher Kanagaraj (@Chrissuccess) October 17, 2025
Blickbuster movie #Dude
Simply super undii another blockbuster by Tamil hero
Mamitha cute Tamil kuttu
Boom boom song was super eh okka song kosam ayina velochuu https://t.co/0AHBy2dhgP— Virat Kohli (@Kranthi_1322) October 17, 2025