Telusu Kada Controversy : దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘తెలుసు కదా’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రేంజ్ లో రన్ అయ్యింది. A సెంటర్ ఆడియన్స్ కి ఈ చిత్రం ఒక మోస్తారు గా నచ్చింది కానీ, మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా అర్థం అవ్వలేదు. కానీ ఓటీటీ ఆడియన్స్ నుండి మాత్రం ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక డిఫరెంట్ ప్రయత్నం చేసారు కానీ, చెప్పాలనుకున్న పాయింట్ ని డైరెక్టర్ మంచిగా చెప్పలేకపోయారు అనే వాదన వినిపించింది. కానీ సిద్దు జొన్నలగడ్డ కు మాత్రం ఈ సినిమా మంచి రిలీఫ్ అనే చెప్పాలి. డీజే టిల్లు ఇమేజి నుండి పూర్తి గా బయటపడ్డాడు. అదే విధంగా మంచి సినిమా ని అందించాడు అనే తృప్తి ఒక సెక్షన్ ఆడియన్స్ కి ఇవ్వడం లో సక్సెస్ అయ్యాడు. సిద్దు ని అభిమానించే ఫ్యాన్స్ కి ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమాతో కచ్చితంగా పెద్ద హిట్ కొడుతాడు అనే నమ్మకం అయితే ఈ చిత్రం కల్పించింది.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం ఇప్పుడు కొత్త వివాదం లో చిక్కుకుంది. తెలుసు కదా చిత్రం కథ నాదే అని, నా నుండి దర్శక నిర్మాతలు దొంగలించారు అని ఒక యువకుడు ఆధారాలతో సహా బయటపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. 2020 వ సంవత్సరం లో ఈ కథని సమంత, నాని, గౌతమ్ తిన్ననూరి వంటి ప్రముఖులకు, నిర్మాతలకు వినిపించానని చెప్పుకొచ్చాడు. అందుకు అతను సమంత తో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసాడు. సినీ ఇండస్ట్రీ లో ఐడియాలను దొంగలించిన ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, ఇక నుండి కథలను ఇతరులకు చెప్పే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ యువకుడు సోషల్ మీడియా లో చెప్పుకొచ్చాడు.
ఒకవేళ సమంత ఆ కథ ని దొంగలించి ఉంటే, తన సొంత నిర్మాణ సంస్థలో సినిమా తీసుకునేది కదా, వేరే వాళ్లకు ఎందుకు చెప్తుంది? అంటూ సోషల్ మీడియా లో సమంత అభిమానుల నుండి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకరికి వచ్చిన ఆలోచన మరొకరికి రావడం లో తప్పేమి ఉంది?, ఎన్నో ముఖ్యమైన పనులు ఉన్న సమంత కి ఇతని ఐడియా ని లీక్ చేయడమే పని నా? అంటూ ఆ కుర్రాడికి కౌంటర్లు ఇస్తున్నారు సమంత ఫ్యాన్స్.
వీరిలో “తెలుసు కదా” స్టోరీ దొంగిలించింది ఎవరు!
తెలుసు కదా సినిమా కథ నాదే.. సాక్ష్యాలతో బయటపెట్టిన యువకుడు
ఇటీవల విడుదలైన తెలుసు కదా అనే తెలుగు చిత్రం కథ తనదే అని, 2020లో సమంత, నాని, గౌతం తిన్ననూరితో పాటు పలువురు ప్రొడ్యూసర్లకు కథ చెప్పానంటూ సోషల్ మీడియాలో సాక్ష్యాలు పెట్టిన… pic.twitter.com/blRzv89VLh
— Telugu Scribe (@TeluguScribe) November 24, 2025