Telusu Kada Movie Collection Day 5: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరైన సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) నుండి రీసెంట్ గానే ‘తెలుసు కదా'(Telusu Kada Movie) అనే చిత్రం విడుదలైంది. మొదటి ఆట నుండే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ వసూళ్లపై చాలా బలమైన ప్రభావం పడింది. కానీ ఒక సెక్షన్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని నచ్చారు. ఫలితంగా అర్బన్ సెంటర్స్ లో ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతూ వచ్చాయి. ముఖ్యంగా నైజాం,ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లు సొంతం చేసుకుంది ఈ చిత్రం. అయినప్పటికీ అది బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఏ మాత్రం సరిపోదు. విడుదలకు ముందు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ‘జాక్’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత ఇంత బిజినెస్ జరగడం గమనార్హం.
అయితే ప్రాంతాలవారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, నైజాం ప్రాంతం నుండి 5 రోజులకు కలిపి రెండు కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక సీడెడ్ ప్రాంతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొదటి రోజు వచ్చిన వసూళ్ల తర్వాత, దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ షేర్ వసూళ్లు రావడం ఆగిపోయాయి అట. ఫలితంగా 5 రోజులకు కలిపి రెంటులు, టాక్సులు తీసేస్తే కేవలం 49 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఈ ప్రాంతంలో డిజాస్టర్ కాదు, అంతకు మించిన పేరు కనిపెట్టాలి. ఇక ఆంధ్రా ప్రాంతం విషయానికి వస్తే 5 రోజుల్లో కేవలం కోటి 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 4 కోట్ల 51 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 40 లక్షల రూపాయిలు, అదే విధంగా ఓవర్సీస్ ప్రాంతం లో కోటి 61 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట.ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 5 రోజులకు కలిపి 6 కోట్ల 52 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి. అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పొచ్చు. సిద్దు నుండి వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ సినిమాలు వచ్చాయి. ఇక ఆడియన్స్ ఇతని నుండి వచ్చే సినిమాలకు కదలడానికి కాస్త ఆలోచిస్తారు. ఇక నుండి అయినా మంచి సినిమాలు తీయకపోతే సిద్దు పరిస్థితి షెడ్డు కే అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.