Baahubali The Epic Pre Release Business: తెలుగు చలన చిత్ర పరిశ్రమని బాహుబలి కి ముందు, బాహుబలి కి తర్వాత అని విభజించవచ్చు. ఈ సినిమా నుండే పాన్ ఇండియా లెవెల్ లో మన ఇండస్ట్రీ ఒక రేంజ్ కి ఎదిగింది. ఇంటర్నేషనల్ లెవెల్ లో మన ఇండియన్ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకోవడం ఈ సినిమా నుండే మనం చూస్తూ వచ్చాము. ఆరోజుల్లోనే ఈ చిత్రం మొదటి భాగం 700 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, రెండవ భాగం ఏకంగా 2000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమా కలెక్షన్స్ ని ఇప్పటి వరకు రాజమౌళి కూడా అందుకోలేకపోయాడు. బాహుబలి 2 తర్వాత ఆయన చేసిన #RRR చిత్రం కేవలం 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. 8 ఏళ్ళ క్రితం విడుదలైన సినిమాని, ఎన్ని సూపర్ హిట్ చిత్రాలు వచ్చినా అందుకోలేకపోతున్నాయి అంటే ఆ సినిమా ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆ చిత్రాన్ని మరోసారి గ్రాండ్ గా ఈ నెల 31వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి పార్ట్ 1 , మరి బాహుబలి పార్ట్ 2 ని కలిపి 3 గంటల 45 నిమిషాలకు కట్ చేసి, ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali : The Epic) పేరు తో ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఒక కొత్త సినిమాని ఎలా అయితే విడుదల చేస్తారో, అంతకు మించి ప్రొమోషన్స్ తో ఈ చిత్రం విడుదల కానుంది. అంతే కాదు ఈ చిత్రాన్ని ఐమాక్స్, డీ బాక్స్,ఐస్, 4dX, డాల్బీ విజన్, Epiq, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని స్క్రీన్ ఫార్మట్స్ ఉంటాయో, అన్ని స్క్రీన్ ఫార్మట్స్ కి ఈ చిత్రాన్ని మార్చి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ మీడియం రేంజ్ హీరోలైన నాని, విజయ్ దేవరకొండ కొత్త సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ ఉండడం గమనార్హం.
ప్రాంతాల వారీగా చూస్తే ఒక్క నైజాం ప్రాంతం లోనే 17 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి ఒక ప్రముఖ నిర్మాత సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదే విధంగా సీడెడ్ ప్రాంతానికి 4 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందట. ఇక ఆంద్ర ప్రాంతానికి ఏకంగా 14 కోట్ల రూపాయిల బిజినెస్ జరుగుతుందని, ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 35 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రం విడుదలకు 10 రోజుల ముందే ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ నుండి ఈ చిత్రానికి లక్షా 50 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇప్పుడే ఇలా ఉంటే, సినిమా విడుదల దగ్గర పడిన సమయానికి ఎలా ఉంటుందో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.