Prabhas Spirit Movie Scene: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…అలాంటి నటుడు చేస్తున్న సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం… సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vamga) దర్శకత్వంలో చేయబోతున్న స్పిరిట్ (Spirit) సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతున్నాడు అనేది వాస్తవం… ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రభాస్ సినిమాతో అది ఇంకాస్త ఎలివేట్ అవుతుందని అతని అభిమానులు సైతం నమ్ముతున్నారు… ప్రస్తుతం ఫౌజీ (Fouji) సినిమాతో బిజీగా ఉన్న ఈ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా మీద తన పూర్తి డేట్స్ ని కేటాయించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా సైతం దాదాపు ప్రభాస్ కోసం రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడనే చెప్పాలి… ఈ సినిమాతో సందీప్ అంటే ఏంటో చూపిస్తానని తన స్నేహితుల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తోంది. అనిమల్ సినిమాను మించి ఈ సినిమా ఉండబోతుందట. ఇక డీటైలింగ్ విషయంలో కూడా సందీప్ చాలా క్లారిటీగా ఉంటాడు.
Also Read: హరిహర వీరమల్లు ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
కాబట్టి కథని చాలా క్లారిటీగా రాసుకోవడమే కాకుండా డీటైలింగ్స్ ని కూడా చాలా అద్భుతంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు…అయితే ఈ సినిమాలో హీరో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు తన క్యారెక్టర్ కి ఒక డీటెయిలింగ్ అయితే ఉంటుందట. అది ఏంటి అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే అంటూ సందీప్ చెబుతున్నాడు…ఈ మూవీలో పోలీస్ గా కనిపించే ప్రభాస్ కి ఒక కేసు విషయంలో తన పై ఆఫీసర్ ఆయనకి కోపం తెప్పించడంతో పోలీస్ స్టేషన్ ను బ్లాస్ట్ చేస్తాడట…ఈ ఒక్క సీన్ తో సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోంది…
మరి ప్రభాస్ క్యారెక్టర్ సినిమా మొత్తం కోపిస్టీగా ఉంటుందా? లేదంటే మధ్యలో అమాయకంగా మారిపోతాడా? పవర్ ఫుల్ గా కనిపిస్తాడా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… నిజానికి సందీప్ సినిమా అంటే హీరోలందరు చాలా కోపం గానే ఉంటారు. షార్ట్ టెంపర్ గా కనిపిస్తూ ఉంటారు.
Also Read: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ఆ లోటు తెలిసిపోతుందా..?
మరి ప్రభాస్ కూడా అదే తరహాలో కనిపిస్తాడా లేదంటే ఆయన పాత్రని మరొక కోణం లో తీర్చిదిద్దుతారా అనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి లేనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ఈ సినిమాతో మరింత ముందుకు దూసుకెళ్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…