https://oktelugu.com/

Manchu Lakshmi : పాముతో పాటు తాను బుసలు కొడుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో మోహన్ బాబు ఒకరు. కళా ప్రపుర్ణ అవార్డు గ్రహీత అయిన మోహన్ బాబు నటన ప్రత్యేకంగా ఉంటుంది. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వివిధ రూపాల్లో కనిపించిన మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, కూతురు మంచు లక్ష్మీలు సినీ ఎంట్రీ ఇచ్చారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 15, 2024 / 03:34 PM IST

    Manchu Lakshimi with snake

    Follow us on

    Manchu Lakshmi : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వారసులుగా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత స్టార్లు గా మారిన వారు ఎందరో ఉన్నారు. వీరిలో కొందరు తండ్రులు, బంధువుల ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరికొందరు చిన్న వయసులోనే నటనతో ఆకట్టుకొని కెమెరా ముందు కనిపించారు. అయితే ఇప్పుడున్న ఓ నటి తండ్రి అప్పుడే స్టార్ హీరో కావడంతో ఆమెకు సినిమా ఓనమాలు నేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాలేదు. దీంతో కొన్ని సినిమాల్లో అవకాశం రావడంతో ఏలాంటి కెమెరా ఫియర్ లేకుండా నటించారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా రాణించారు. ఇప్పుడు నిర్మాతగా అలరిస్తున్నారు. మరోవైపు సమాజ సేవలోనూ ఉన్నారు. అయితే ఈమెకు చెందిన చిన్న నాటి పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఇందులో ఆమె చిన్న వయసులోనే పామును చేత బట్టుకొని కనిపిపించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

    టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో మోహన్ బాబు ఒకరు. కళా ప్రపుర్ణ అవార్డు గ్రహీత అయిన మోహన్ బాబు నటన ప్రత్యేకంగా ఉంటుంది. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వివిధ రూపాల్లో కనిపించిన మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, కూతురు మంచు లక్ష్మీలు సినీ ఎంట్రీ ఇచ్చారు. మోహన్ బాబు తన నిర్మాణ సంస్థను కూతురు లక్ష్మీ ప్రసన్న పేరుమీద ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే లక్ష్మీకి ఇండస్ట్రీపై అసక్తి పెరిగింది. దీంతో ఆమె సినిమాల్లోకి రావాలని అనుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ఏకంగా అమెరికాలో బుల్లితెరపై ప్రసారమైన ధారవాహిక ‘లాస్ వేగాస్’ లో కనిపించింది.

    ఆ తరువాత కొన్నాళ్ల పాటు అక్కడే ఉన్న మంచు లక్ష్మీ తిరిగి ఇండియాకు వచ్చారు. ఇక్కడ సిద్ధార్థ నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో మంచు లక్ష్మి విలన్ పాత్రతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ‘గుండెల్లో గోదారి’ సినిమాలో హీరోయిన్ గా కనిపించారు. అయితే ఇందులో తాప్సీ కూడా ఉన్నారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. అయితే నిర్మాతగా పలు సినిమాలు తీసిన ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిస్కూళ్లను దత్తత తీసుకొని వాటికి నిధులు మంజూరు చేస్తున్నారు.

    మంచు లక్స్మీ డేరింగ్ అండ్ డ్యాషింగ్ అని పలు సందర్భాల్లో చెప్పారు. తాను చిన్నప్పటి నుంచే యాక్టివ్ గా ఉంటానని తెలిపింది. ఇందులో భాగంగా ఓ పిక్ ను ఆమె షేర్ చేసింది. ఇందులో మంచు లక్ష్మీ ఐదేళ్ల యవసులో ఉన్నారు. ఈ సమయంలో ఆమె చేతిలో పాముతో కనిపించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటో క్యాప్షన్ గా ‘నేను 5 ఏళ్లు వయసులో ఉన్నప్పుడే ధైర్యవంతురాలిని’ అని మెసేజ్ పెట్టారు.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మికి నెట్టింటా ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. దీంతో ఆమె షేర్ చేసిన పిక్స్ కు విపరీతమైన లైక్స్ వస్తున్నాయి.