Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే మంచి విజయాలను అందుకొని ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో ముందుకు దూసుకెళ్లాడు…ఇక కృష్ణవంశీ తో చేసిన ‘మురారి ‘ సినిమా సక్సెస్ సాధించి ఆయనకి మొదటి బ్రేక్ ఇవ్వగా, ఆ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులందరికీ చాలా ఇష్టమైన సినిమా అనే చెప్పాలి. ఇక ప్రతి సీన్ లోను ఫ్యామిలీ తాలూకు ఎమోషన్స్ ని చూపిస్తూ వాళ్ల మధ్య రిలేషన్ షిప్ ఎలా ఉండాలో కూడా కృష్ణవంశీ ఈ సినిమాతో చాలా బాగా చూపించాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు కృష్ణవంశీ, ఇటు మహేష్ బాబు ఇద్దరు భారీ సక్సెస్ ని అందుకున్నారు. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు… ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ కృష్ణవంశీ ఈ సినిమా చేసిన తర్వాత ఎన్టీఆర్ కూడా సేమ్ అలాంటి సినిమానే తనకు కూడా చేసి పెట్టమని కృష్ణవంశీ ని అడిగాడట. కానీ కృష్ణవంశీ మాత్రం ఎన్టీఆర్ తో రాఖీ లాంటి ఒక సామాజిక బాధ్యత కలిగిన కథతో సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అనే కాదు ప్రతిసారి మహేష్ బాబు ఎలాంటి సినిమా అయితే చేస్తాడో అలాంటి సినిమానే తను కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు… ఉదాహరణకి మహేష్ బాబు పూరి జగ న్నాధ్ దర్శకత్వంలో ‘ పోకిరి ‘ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత ఆయన మెహర్ రమేష్ డైరెక్షన్ లో కంత్రి అనే సినిమా చేశాడు. ఇక పోకిరి సినిమాకి కంత్రి సినిమాకి చాలా దగ్గర పోలికలు ఉండడం విశేషం…అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందనే చెప్పాలి… ఇక మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్ లో చేసిన శ్రీమంతుడు సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇక దాంతో ఎన్టీఆర్ కూడా కొరాటల శివ డైరెక్షన్ లో శ్రీమంతుడు లాంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో పట్టుబట్టి మరి జనతా గ్యారేజ్ సినిమా చేసి ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఇలా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ని ఫాలో అవుతూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
ఇక నిజజీవితంలో వీళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఉండటం విశేషం… ఎన్టీఆర్ ఇప్పటికి కూడా మహేష్ బాబుని అన్నా అని పిలుస్తూ ఉంటాడు. అలాగే మహేష్ బాబు మాత్రం ఎన్టీఆర్ ని తారక్ అంటూ సంబోధిస్తాడు. అలాగే ఒకరి సినిమాల గురించి మరొకరు మాట్లాడుకుంటూ ఉంటారు…
ఇక మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి మహేష్ బాబుకి మధ్య మంచి బాండింగ్ ఉందనే చెప్పాలి…ఇక ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఇద్దరు కూడా భారీ సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకొని ముందుకు సాగుతున్నారు…