https://oktelugu.com/

Surya: సూర్య తో మల్టీస్టారర్ సినిమాకి రెఢీ అయిన తెలుగు స్టార్ హీరో…

తెలుగులో రామ్ చరణ్ తో కలిసి త్రిబుల్ ఆర్ సినిమాలో నటించారు. ఇక ఇప్పుడు వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : March 10, 2024 / 10:26 AM IST

    Surya

    Follow us on

    Surya: ప్రస్తుతం ఇండియా మొత్తంలో ఎక్కడ చూసినా మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ఏ ముహూర్తాన రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పెట్టి త్రిబుల్ ఆర్ సినిమా తీశాడో కానీ అప్పటినుంచి ప్రతి ఒక్కరూ మల్టీ స్టారర్ సినిమాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా తెరమీదకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. తెలుగులో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ మరోసారి మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది.

    ఆయన తెలుగులో రామ్ చరణ్ తో కలిసి త్రిబుల్ ఆర్ సినిమాలో నటించారు. ఇక ఇప్పుడు వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి దర్శకుడి గా ఎవరు వ్యవహరిస్తారు అనే విషయం లో క్లారిటీ రాలేదు కానీ ప్రొడ్యూసర్ జ్ఞానవెల్ రాజా మాత్రం వీళ్ళ కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక దానికోసమే మంచి స్క్రిప్ట్ ను కూడా రెడీ చేయిస్తున్నారట. ఈ సినిమాతో ఒక భారీ పాన్ ఇండియా సినిమా రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతానికి సూర్య ‘కంగువ ‘ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

    ఇక శివ తెలుగులో ఇప్పటికే శౌర్యం, శంఖం, దరువు లాంటి సినిమాలకు డైరెక్షన్ చేశాడు.ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ కూడా కొరటాల శివ డైరెక్షన్ లో ‘ దేవర ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తను మరో సూపర్ సక్సెస్ ను అందుకోవాలని విపరీతంగా కష్టపడుతున్నాడు.

    ఇక ఈ దెబ్బతో మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటాడని నందమూరి అభిమానులు కూడా మంచి ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారట…