Rajeev Kanakala: రాజీవ్ కనకాల ఎన్టీయార్ కి చేసిన ప్రామిస్ ఏంటో తెలుసా..?

ఎన్టీఆర్, రాజీవ్ కనకాల లా మధ్య మాత్రం చాలా మంచి బాండింగ్ ఉందనే విషయం మనందరికీ తెలిసిందే... వీళ్లిద్దరు 'స్టూడెంట్ నెంబర్ వన్' సినిమా నుంచి ఇప్పుడు వస్తున్న 'దేవర ' సినిమా వరకు అన్ని సినిమాల్లో కలిసి నటిస్తున్నారు.

Written By: Gopi, Updated On : March 10, 2024 10:20 am

Rajeev Kanakala

Follow us on

Rajeev Kanakala: చాలామంది నటీనటులు ఎవరికి వారే వాళ్ళ సినిమాలని కమిట్ అయి వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు. కానీ కొందరు మాత్రం ఇక్కడ ఫ్రెండ్షిప్ కి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగుతుంటారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన కెరియర్ మొదటి నుంచి రాజీవ్ కనకాల, రోలర్ రఘు లాంటి కొంతమందిని తన ఫ్రెండ్స్ గా చేర్చుకొని తను చేసే ప్రతి సినిమాలో వాళ్ళకి ఏదో ఒక క్యారెక్టర్ ఉండేలా డిజైన్ చేసుకుంటూ వస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్, రాజీవ్ కనకాల లా మధ్య మాత్రం చాలా మంచి బాండింగ్ ఉందనే విషయం మనందరికీ తెలిసిందే… వీళ్లిద్దరు ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా నుంచి ఇప్పుడు వస్తున్న ‘దేవర ‘ సినిమా వరకు అన్ని సినిమాల్లో కలిసి నటిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే రాజీవ్ కనకాల ఎన్టీఆర్ కి ఒక ప్రామిస్ కూడా చేశారంట. అదేంటంటే “నా ప్రాణం ఉన్నంత వరకు నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే, అలాగే నేను ఎక్కడున్నా నీ మంచి కోరుకుంటూ ఉంటాను”. అని రాజీవ్ కనకాల ఎన్టీఆర్ కి ఒక పెద్ద ప్రామిస్ అయితే చేశారట. ఇక దాంతో వీళ్లిద్దరి మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో మనకు అర్థమవుతుంది.

అలాగే దీని ద్వారా రాజీవ్ కనకాలకి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియాలో ‘వన్ ఆఫ్ ది టాప్ స్టార్ ‘ గా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు కనక వరుసగా రెండు, మూడు హిట్లు కొడితే ఎన్టీఆర్ మరింత టాప్ పొజిషన్ కి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఎన్టీఆర్ ఇప్పుడు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటు ముందుకు సాగాలని చాలామంది కోరుకుంటున్నారు.

ఇక ఎన్టీయార్ ఇప్పటికీ కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఫ్రెండ్స్ కి కూడా చాలా వాల్యూ ఇస్తూ ఉంటాడు. షూటింగ్స్ కి ఏ మాత్రం బ్రేక్ దొరికిన కూడా ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. అందువల్లే రాజీవ్ కనకాల ఎన్టీఆర్ లా మధ్య మంచి సన్నిహిత్యం అయితే ఉంది…